Friday, November 22, 2024

న్యూఢిల్లీ : వాట్సాప్ కు దేశీయ ప్రత్యామ్నాయం సందేశ్, సంవాద్

పైవసీ పాలసీ.. వాట్సాప్‌ పాలిట శాపం గా మారింది. ఇప్పటికే వాట్సాప్‌కు ప్రత్యామ్నా య యాప్‌ల వైపు ప్రజ లు పరుగులు పెడుతున్నా రు. దీనికి తోడు భారత్‌ ప్రభుత్వం కూడా రెండు యాప్‌ల అభివృద్ధిపై దృష్టి పెట్టింది. సందేశ్‌, సం వాద్‌ పేరుతో ఈ రెండు యాప్‌లను వాట్సాప్‌కు ప్రత్యామ్నాయంగా తీసుకొచ్చేందుకు ప్రణాళిక లు సిద్ధం చేస్తోంది. అంతర్గత కమ్యూనికేషన్‌ వ్యవస్థకు ఈ రెం డు యాప్‌లు ఎంతో ఉపయోగకరంగా ఉంటాయని నిపుణు లు చెబుతున్నారు. ప్రభుత్వంలోని రెండు వేర్వేరు విభాగా లు.. ఈ యాప్‌లను అభివృద్ధి చేస్తున్నాయి. ప్రజల్లోకి తీసుకొ చ్చే ముందు వాటిని అన్ని కోణాల్లో పరీక్షలు నిర్వహిస్తున్నారు. సందేశ్‌ యాప్‌ను నేషనల్‌ ఇన్‌ఫార్మాటిక్స్‌ సెంటర్‌ అభివృద్ధి చేస్తోంది. ఐటీ మంత్రిత్వ శాఖ కింద ఇది పని చేస్తుంది. సందేశ్‌ యాప్‌ అనేది యాపిల్‌ యాప్‌ స్టోర్‌ నుంచి డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చు. మరికొన్ని రోజుల్లో గూ గుల్‌ ప్లే స్టోర్‌లో కూడా ఇది అందుబాటులోకి రానుంది. సంవాద్‌ యాప్‌ ఇంకా ప్రజల్లోకి రాలే దు. దీన్ని సెంటర్‌ ఫర్‌ డెవలప్‌మెంట్‌ ఆఫ్‌ టెలి మ్యాటిక్స్‌ (సీ-డాట్‌) అభివృద్ధి చేస్తోంది. ఇది కూ డా ఐటీ మంత్రిత్వ శాఖ కింద ఉంటుంది. సందేశ్‌ యాప్‌లో మీ పుట్టిన తేదీ, చిరునామా, మెయిల్‌, జాబ్‌ లాంటి విషయాలు నమోదు చేసుకోవచ్చు. ఇటువంటివి వాట్సాప్‌లో పొందలే రు. లాగిన్‌ అవ్వడానికి ఎలాంటి ఫోన్‌ నెంబర్‌ అవసరం ఉండదు. కేవలం మెయిల్‌ ద్వారా సందేశ్‌లోకి లాగిన్‌ కావొచ్చు.

Advertisement

తాజా వార్తలు

Advertisement