Friday, November 22, 2024

న్యూఢిల్లీ : వచ్చే ఏడాదే చంద్రయాన్ : ఇస్రో చైర్మన్

భారతదేశపు మూడవ చంద్రయాన్‌ మిషన్‌ ప్రయోగం మరోసారి వాయిదా పడింది. ఈ ఏడాదిలో ప్రయోగం చేపట్టాలని తొలుత భావించారు. అయితే, ప్రస్తుత కొవిడ్‌ మహమ్మారి పరిస్థితుల నేపథ్యంలో ఈ ప్రయోగాన్ని వచ్చే ఏడాదికి వాయిదా వేశారు. చంద్రయా న్‌-3తోపాటు ఇస్రో చేపట్టిన మరికొన్ని ప్రాజెక్టులు కూడా వాయిదా పడుతున్నాయి. చంద్రయాన్‌-2కి భిన్నంగా ఆర్బిటర్‌ ఉండదని, 2022లో ప్రయోగం చేపట్టే అవకాశా లున్నాయని ఇస్రో చైర్మన్‌ శివన్‌ వెల్లడించారు. దీనిపై పరిశోధనలు కొనసాగుతున్నాయని చెప్పారు. ఇది చంద్ర యాన్‌-2 లాంటి కాన్ఫిగరేషన్‌ ఉంటుంది. కానీ, దీనికి ప్రత్యేకంగా ఆర్బిటర్‌ ఉండదు. చంద్రయాన్‌ -2కి వాడిన ఆర్బిటర్‌నే దీనికీ ఉపయోగిస్తాం అని తెలిపారు. చంద్ర యాన్‌-2 ల్యాండింగ్‌ ప్రదేశంలోనే చంద్రయాన్‌-3ని కూడా కిందకు దించాలని ఆలోచన చేస్తున్నట్లు ఇదివరకు శివన్‌ వివరించారు. 2019 జులై 22న ప్రయోగించిన చంద్రయాన్‌-2 లూనార్‌ దక్షిణ ధ్రువంపై ల్యాండింగ్‌వేళ నేలను ఢీకొనడంతో ప్రయోగం బెడిసికొట్టింది. ల్యాండర్‌ విక్రమ్‌ను చంద్రుడిపై సురక్షితంగా అడుగుపెట్టించిన తొలిదేశంగా నిలవాలన్న కలలు చెదిరాయి. ఈ నేపథ్యం లో చంద్రయాన్‌-3 ప్రయోగానికి ఇస్రో శాస్త్రవేత్తలకు సవాల్‌గా మారనుంది. దీనిని సక్సెస్‌ చేయడం ద్వారా, భవిష్యత్‌లో మరిన్ని ఇతర గ్రహాలపైకి అడుగుపెట్టాలని, ఈ దిశగా భారతదేశ సామర్థ్యాలను ప్రపంచానికి చాటాలని ఇస్రో పట్టుదలతో ఉంది. దీని తర్వాత మరో మానవహరిత మిషన్‌ను ప్రయోగించేందుకూ కసరత్తు చేస్తున్నామని శివన్‌ తెలిపారు. గగన్‌యాన్‌ ప్రాజెక్టు కింద మొట్టమొదటి మానవ మిషన్‌ను చేపట్టాలనే లక్ష్యంతో ఉన్నామని చెప్పారు. ఈ ప్రాజెక్టులో భాగంగా ముగ్గురు వ్యక్తులను అంతరిక్షం లోకి పంపిస్తామని చెప్పారు. ఇందుకోసం నలుగురు భారతీయ వ్యోమగాములు శిక్షణ పొందుతున్నారని వివరించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement