Friday, November 22, 2024

న్యూఢిల్లీ : ‘మహా’ సహా 7 రాష్ట్రాల్లో కరోనా సెకండ్ వేవ్ కలకలంం

మహారాష్ట్ర సహా మరికొన్ని రాష్ట్రా ల్లో కోవిడ్‌-19 కేసుల సంఖ్య అకస్మాత్తుగా పెరగడంతో దేశంలోని మిగతా రాష్ట్రాల్లో కరోనా సెకండ్‌ వేవ్‌ భయం పట్టుకుంది. ప్రపంచవ్యాప్తంగా అనేక దేశాల్లో సెకండ్‌ వేవ్‌ తీవ్ర ప్రభావాన్ని చూపుతుండగా, భారత్‌లో ఆ పరిస్థితి లేద ని తొలుత అందరూ ఊపిరిపీల్చుకున్నారు. కానీ మహా రాష్ట్రతో పాటు మరికొన్ని రాష్ట్రాల్లో రోజురోజుకీ కొత్త కేసుల సంఖ్య పెరగడం, దేశంలోని యాక్టివ్‌ కేసుల్లో అత్యధిక భాగం ఈ నాలుగైదు రాష్ట్రాల నుంచే ఉండడం ఆందోళన కు గురిచేస్తోంది. జన్యుపరివర్తనాలు, మార్పులకు గురైన కరోనా వైరస్‌ రకాలు బయటపడడం, వాటిలో కొన్ని రకా లు అత్యంత వేగంగా వ్యాప్తి చెందే లక్షణంతో పాటు ప్రమా దకారిగా నిపుణులు అనుమానించడం ఈ భయాలను రెట్టింపు చేస్తోంది. దీంతో కేసులు పెరుగుతున్న రాష్ట్రాలతో పాటు ఇతర రాష్ట్రాల్లో సైతం కోవిడ్‌-19 నిబంధనలను మరింత కఠినతరం చేస్తూ ఆదేశాలు జారీ చేస్తున్నాయి. వారం రోజుల వ్యవధిలో 16 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాం తాల్లో కేసులు స్వల్పంగా పెరిగినట్టు గణాంకాలు చెబుతు న్నాయి. నెల రోజుల వ్యవధిలో మహారాష్ట్రలోని 7 గురు మంత్రులకు కోవిడ్‌-19 సోకింది. కేసులు పెరుగుతున్న మహారాష్ట్ర, రాజస్థాన్‌ రాష్ట్రాల్లో కఠిన ఆంక్షలు అమలవుతున్నాయి. మహారాష్ట్రలో అమరా వతి, ముంబై, పుణ, పింప్రి – చించ్వాడ్‌, నాగ్‌పూర్‌, నాసిక్‌, ఔరంగాబాద్‌, థానే, నవీ ముంబై, కళ్యాణ్‌ – డోంబివ్లి, యవ ట్మాల్‌, వషిం, బుల్దానా జిల్లాలు, నగరాల్లో ఆంక్షలు, నిషే ధాజ్ఞలు అమలవుతున్నాయి. కొన్ని చోట్ల నైట్‌ కర్ఫ్యూ అమ లు చేస్తుండగా, అమరావతిలో పాక్షిక లాక్‌డౌన్‌ అమలవు తోంది. రాజస్థాన్‌లోని జోధ్‌పూర్‌లో 144 సెక్షన్‌ ఆంక్షలు విధించారు. అలాగే రాజస్థాన్‌ రాష్ట్రమంతటా వివాహాలు, సభలు, సమావేశాలపై పరిమితులు విధిస్తూ, 100 మందికి మించి అతిధులు ఉండరాదని ఆ రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది.
మహారాష్ట్రతో సరి#హద్దులు కలిగిన కర్నాటక, సరి#హద్దు ల్లో చెక్‌ పోస్టులు ఏర్పాటు చేసింది. మహారాష్ట్ర నుంచి కర్నాటకలో ప్రవేశించే ప్రయాణికులు కోవిడ్‌-19 నెగెటివ్‌ రిపోర్ట్‌ కలిగి ఉండాలని నిబంధనలు విధించింది. కర్నాటక రాజధాని బెంగళూరులోని ఓ అపార్ట్‌మెంట్‌ కాంప్లెక్సులో ఒకే రోజు 10 కొత్త కేసులు నమోదవడం, గత వారం వ్యవధి లో పదుల సంఖ్యలో కేసులు పెరగడంతో ఆ కాంప్లెక్సును కంటైన్మెంట్‌ జోన్‌గా అధికారులు ప్రకటించారు. ముందు జాగ్రత్తగా ఉత్తరాఖండ్‌ రాష్ట్రం కూడా ఆంక్షలు అమలు చేస్తోంది. కోవిడ్‌-19 కేసులు ఎక్కువగా ఉన్న రాష్ట్రాలైన మహారాష్ట్ర, గుజరాత్‌, కేరళ, మధ్యప్రదేశ్‌, చత్తీస్‌గఢ్‌ నుం చి వచ్చే ప్రయాణికులకు కోవిడ్‌-19 పరీక్షలు తప్పనిసరి అంటూ ఉత్తరాఖండ్‌ ప్రకటించింది. పంజాబ్‌లో కేసుల సంఖ్య స్వల్పంగా పెరగడంతో ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా వైద్యులు, నిపుణులతో ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి కెప్టెన్‌ అమరీందర్‌ సింగ్‌ సమీక్షా సమావేశం ఏర్పాటు చేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement