Tuesday, November 26, 2024

న్యూఢిల్లీ : మన వైద్య వ్యవస్థకు ప్రపంచ దేశాల ప్రశంసలు: మోడీ

భారతీయ సాంప్రదాయ వైద్యవిధానం, ఔషధాల గొప్ప తనాన్ని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ కొనియాడారు. దేశీయ ఔషధ రంగం ప్రపంచ వేదికపై విశ్వసనీయతను పొందిందని పేర్కొన్నారు. ప్రపంచ అవసరాలకు అనుగుణంగా మరిన్ని పరిశోధనలు, నాణ్యత ను కొనసాగించాల్సిన అవసరం ఉందన్నారు. కొవిడ్‌ చికిత్సకు ఆయుర్వేద ట్యాబ్లెట్‌ కరోనిల్‌ను ప్రోత్సహించాలన్న ప్రభుత్వ నిర్ణ యాన్ని ఇండియన్‌ మెడికల్‌ కౌన్సెల్‌ ప్రశ్నించిన మరుసటి రోజే ప్రధా ని ఈ విధమైన వ్యాఖ్యలు చేయడం విశేషం. బడ్జెట్‌కు సంబంధించిన అంశాలను ఆరోగ్యరంగంలో అమలు అంశంపై ప్రధాని మంగళవా రం వెబినార్‌లో ప్రసంగించారు. ఈ సందర్భంగా సనాతన భారతీ య వైద్య విధానం ప్రాముఖ్యతను ప్రస్తావించారు. భారతీయ సాంప్ర దాయ ఔషధాలన శక్తిని గుర్తించిన తర్వాత ప్రపంచ ఆరోగ్యసంస్థ (డబ్ల్యుహెచ్‌ఒ) మనదేశంలో ఈ ఔషధాల కోసం ప్రపంచంలోనే మొట్టమొదటి కేంద్రాన్ని స్థాపించే ప్రకియలో ఉందని గుర్తుచేశారు. ప్రపంచం యోగాను అంగీకరిస్తున్నట్లుగా, ఇది సంపూర్ణ ఆరోగ్యం వైపు మళ్లుతుంది. దుష్ఫలితాలు లేని ఆరోగ్య వ్యవస్థను సమాజం కోరుకుంటోంది. సాంప్రదాయ మందులు మూలికా ఆధారితరమై నవి. ఇవి హానికరం కాదున్నారు. కొవిడ్‌ కాలంలో ఆయుష్‌ నెట్‌వర్క్‌ మంచి పనితీరు కనబరిచింది. రోగనిరోధక శక్తిని పెంచడానికి మాత్ర మే కాకుండా, శాస్త్రీయ పరిశోధనలకు కూడా ఆయుష్‌ మౌలిక సదు పాయాలు దేశానికి ఎంతో సహాయపడ్డాయి. దేశీయ ఔషధాలు, వ్యాక్సిన్లతోపాటు, సుగంధ ద్రవ్యాల కషాయం కూడా దోహదపడిం ది. మన ఔషధాల ఖ్యాతిని అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్లడం మన ముందున్న కర్తవ్యం అని ప్రధాని వివరించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement