ఫేక్ న్యూస్ కట్టడి చేయడాానికి తీసుకున్న చర్యలేమిటో తెలియజేయాలని సుప్రీం కోర్టు కేంద్రానికి నోటీసులు జారీ చేసింది. నకిలీ ఖాతాలు, వాటి ద్వారా తప్పుడు సమాచారం, విద్వేష పూరిత సందేశాలు ఇత్యాది ట్విట్టర్ తదితర సామాజిక మాధ్యంలో పోస్టు చేస్తున్నారనీ, అటువంటి ప్రచారానికి, పోస్టులకు అడ్డుకట్ట వేసే వ్యవస్థ ఏర్పాటు కోరుతూ బీజేీప నేత వినీత్ గోయెంకా సుప్రీంలో గత ఏడాది మే నెలలో పిటిషన్ దాఖలు చేశారు. ఫేస్ బుక్, ట్విట్టర్ వంటి సామాజిక మాధ్యమాల్లో పెద్ద ఎత్తున నకిలీ ఖాతాలున్నాయనీ, వాటి ద్వారా ప్రముఖులు, రాజకీయ నాయకుల ఇమేజ్ ను చెడగొట్టే ప్రయత్నం జరుగుతోందని ఆయన తన పిటిషన్ లో ఆరోపించారు. ఇప్పుడు ట్విట్టర్ , కేంద్రానికి మధ్య ఘర్షణ వాతావరణం నెలకొన్న ఈ సమయంలో ఈ పిటిషన్ సు ప్రీంలో విచారణకు రావడం గమనార్హం.
Advertisement
తాజా వార్తలు
Advertisement