Tuesday, November 26, 2024

న్యూఢిల్లీ : నేడు స్థిరంగా పెట్రో ధరలు

గత కొన్ని రోజులుగా వరుసగా పెరుగుతూ వస్తున్న ప్రెట్రో ధరలు నేడు స్థిరంగా ఉన్నాయి. గత 14 రోజులుగా ప్రతి రోజూ చమురు సంస్థలు పెట్రో ధరలను పెంచుతూ వచ్చాయి. అయితే ఈ రోజు మాత్రం ఎటువంటి పెంపుదల లేదు. దీంతో కనీసం తాత్కాలికంగానైనా పెట్రో ధరల మంటకు చమురు సంస్థలు విరామం ఇచ్చినట్లు భావించవచ్చు. అయితే అంతర్జాీయ విపణిలో ముడి చమురు ధరలు పెరిగినప్పటికీ దేశీయంగా చమురు సంస్థలు పెట్రో రేట్లు పెంచక పోవడానికి కారణం కేంద్రం ఆదేశాలేనని అంటున్నారు. త్వరలో పశ్చిమ బెంగాల్, తమిళనాడు సహా ఐదు రాస్ట్రాలలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో కేంద్రం పెట్రో ధరల పెంపునకు  బ్రేక్ వేయాలని చమురు సంస్థలను ఆదేశించినట్లు చెబుతున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement