Thursday, November 21, 2024

న్యూఢిల్లీ : ద్రవ్యలోటు తిప్పలు తప్పవు!

అధిక ద్రవ్యలోటు కారణంగా భారత్‌కు సవాళ్ల ముప్పుపొం చివుందని గ్లోబల్‌ రేటింగ్‌ ఏజెన్సీ ఫిచ్‌ హెచ్చరిం చింది. జీడీపీ, రుణ మధ్య నిష్పత్తి తగ్గించడం క్లిష్టంగా పరిణమిస్తుందని పేర్కొంది. సవరించిన బడ్జెట్‌ లక్ష్యాల అంచనాల ప్రకారం… వచ్చే ఐదేళ్లలో జీడీపీ, రుణ నిష్పత్తి 90 శాతం మేర పెరిగే అవకాశం ఉందని అంచనా వేసింది. 2019లో ప్రభుత్వ రుణాలు, జీడీపీ మధ్య నిష్పత్తి 72 శాతంగా ఉంది. కరోనా నుంచి రికవరీ అవుతున్న ఆర్థిక వ్యవస్థకు ద్రవ్య విధాన రూపంలో బడ్జెట్‌ దన్నుగా నిలవలేకపోయింది. ఫలితంగా అప్పులు పెరిగిపోతాయని ఫిచ్‌ పేర్కొంది. అయితే బడ్జెట్‌తోసహా ఇటివల చేపట్టిన సంస్కరణలు, విధానపరమైన చర్యలను వృద్ధి అంచనాల్లో పరిగణలోకి తీసుకుంటాం. అప్పులను కూడా పరిగణిస్తామని పేర్కొంది. ఏప్రిల్‌ నుంచి ప్రారంభమయ్యే కొత్త ఆర్థిక సంవత్సరంలో భారత్‌ 11 శాతం వృద్ధిరేటును నమోదు చేయనుంది. ఆ తర్వాత 2025-26 వరకు 6.5 శాతం చొప్పున వృద్ధిరేటును నమోదు చేయనుందని ఫిచ్‌ విశ్లేషించింది. మార్చి 2022లొ ముగిసే ఆర్థిక సంవత్సరం లో ద్రవ్యలోటు ఆర్థిక సంవత్సరం 2026 వరకు ఏడాదికి 1 పీపీ(పర్సెం టేజ్‌ పాయింట్‌) చొప్పున పెరగనుం ది. ఈ విధంగా పెరుగుదలతో జీడీపీ, అప్పుల నిష్పత్తి తగ్గింపు క్లిష్టతర మవు తుందని పేర్కొంది. ప్రస్తుత ఆర్థిక సంవత్స రంలో లక్ష్యంగా ఉన్న 3.5 శాతం ద్రవ్యలోటును భారత్‌ కట్టుతప్పింది. కరోనా నేపథ్యంలో వ్యయాలు పెరగడం ఇందుకు కారణంగా ఉంది. ప్రభుత్వ ఆదాయం కంటే వ్యయాలు భారీగా పెరిగాయి. ఏప్రిల్‌ నుంచి ప్రారంభమయ్యే కొత్త ఆర్థిక సంవత్సరంలో ద్రవ్యలోటు జీడీపీలో 6.8 శాతంగా ఉండొచ్చునని బడ్జెట్‌ 2021-22లో ప్రభుత్వం అంచనా వేసింది. 2025-26 నాటికి ద్రవ్యలోటు 4.5 శాతానికి తగ్గొచ్చునని ప్రభుత్వం అంచనా వేసింది. కరోనా ప్రభావం ప్రభుత్వ వ్యయాలపై ప్రభావం పడొచ్చని గతేడాది జూన్‌ బీబీబీ రేటింగ్‌ను రుణాత్మకంగా ఇచ్చిన విషయం తెలిసిందే.
ప్రభుత్వరంగ బ్యాంకులకు కేటాయించిన రూ.20 వేల కోట్ల మూలధనం సరిపోదని, తగిన మొత్తంలో పెంచాల్సి ఉందని సూచించింది. ప్రభుత్వరంగ బ్యాంకులు అసెట్‌ క్వాలిటీ ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశం కనిపిస్తోందని హెచ్చరించింది. బ్యాంకుల ఎన్‌పీఏల నిర్వహ ణకు ప్రతిపాదించిన బ్యాడ్‌ బ్యాంక్‌, అసెట్‌ మేనేజ్‌ మంట్‌ కంపెనీ ఎలా ఉండ బోతోందనేది రూపొందించే విధానం పై ఆధారపడి ఉంటుందని ఫిచ్‌ విశ్లేషించింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement