Friday, November 22, 2024

న్యూఢిల్లీ : జమిలి లేనట్టే!

  • ఆంధ్రప్రభ దినపత్రిక పేజ్ వన్ స్పెషల్ స్టోరీ
  • ఆశలు పెట్టుకున్న పార్టీలు డీలా
  • ధరల పెరుగుదలతో భాజపాలో ఆందోళన
  • దూరమవుతున్న మధ్యతరగతి ప్రజలు
  • 20 రాష్ట్రాలు ఆవెూదిస్తేనే జమిలి
  • 17 రాష్ట్రాల్లోనే అధికారంలో కమలనాథులు
  • మరో మూడు రాష్ట్రాల్లో అధికారం అవసరం
  • ప్రస్తుతం ఐదు రాష్ట్రాల్లో ఎన్నికలు
  • మూడు రాష్ట్రాల్లో గెలిచే అవకాశం తక్కువ
  • అందుకే షెడ్యూల్‌కు గ్రీన్‌ సిగ్నల్‌

ఐదు రాష్ట్రాల ఎన్నికల షెడ్యూల్‌ను కేంద్ర ఎన్ని కల సంఘం ప్రకటించింది. దీంతో దీర్ఘకాలంగా సాగుతున్న జమిలి ఎన్నికల ప్రయత్నం పక్కకు పోయిం ది. ఆంధ్రప్రదేశ్‌తో పాటు పలు రాష్ట్రాల్లో అధికారం కోల్పోయిన పార్టీలు జమిలి ఎన్నికలపై ఆశలెట్టుకున్నాయి. వచ్చే ఏడాది జూన్‌ తర్వాత దేశవ్యాప్తం గా జమిలి ఎన్నికలు జరిగే అవకాశాలు ఉన్నాయంటూ ఇంతవరకు ఇవి విశ్వసించాయి. ఏపీలో తెలుగుదేశం పార్టీ పంచాయతీ ఎన్నికల పరాభవం అనంతరం క్యాడర్‌లో తిరిగి ఉత్తేజం నింపేందుకు జమిలి ఎన్నికలపై బాగా ప్రచారం చేపట్టింది. ఇదే పరిస్థితి కర్ణాటక, బీహార్‌ల్లో కూడా ఉంది. అయితే రాష్ట్రాల్లోని విపక్ష పార్టీలన్నీ తాజా ఎన్నికల ప్రకటనతో డీలా పడక తప్పదు. ఈ ఏడాది ఏప్రిల్‌లో ఐదు రాష్ట్రాలకు ఎన్నికలు జరగ నున్నాయి. దీంతో వచ్చే ఏడాది జూన్‌ లేదా డిసెంబర్‌లో దేశవ్యాప్తంగా ఎన్నికలు జరిగే అవకాశం లేదు. సాధారణ షెడ్యూల్‌ ప్రకారం తిరిగి 2024 ఏప్రిల్‌లోనే లోక్‌సభకు ఎన్నికలు జరుగుతాయి. దాంతో పాటు అప్పటికి ఖాళీ అయ్యే రాష్ట్రాల అసెం బ్లిdలకు ఎన్నికలు నిర్వహిస్తారు. అంతకుమించి ఈ లోగా లోక్‌సభకు దేశంలోని అన్ని రాష్ట్రాల శాసన సభలకు ఎన్నికలు నిర్వహించే పరిస్థితి లేదని నిపు ణులు విశ్లేషిస్తున్నారు. షెడ్యూల్‌ విడుదలైన ఐదు రాష్ట్రాల్లో తమ పరిస్థితి పట్ల బీజేపీ ఆందోళనలో ఉంది. దేశవ్యాప్తంగా మధ్యతరగతిలో ఆ పార్టీపై తీవ్ర అసహనం వ్యక్తమౌతోంది. ఇది ఎన్నికల్లో ప్రభావం చూపుతుందన్న భయం ఇప్పటికే ఆ పార్టీ నాయకులకు పట్టుకుంది. ఈ దశలో రెండేళ్ళు అధికారాన్ని వదిలి 2022లోనే జమిలీ ఎన్నికలకు తలపడే ధైర్యం బీజేపీ చేయదని నిపుణులు విశ్లేషిస్తున్నారు. భారీగా పెరుగుతున్న గ్యాస్‌, పెట్రోల్‌ ధరలకు తోడు ఢిల్లిd పరిసర రాష్ట్రాల్లో కొనసాగుతున్న రైతు ఉద్యమం కూడా ప్రభుత్వానికి తలనొప్పిగా మారింది. దేశవ్యాప్తంగా పలు ప్రభుత్వరంగ సంస్థల్ని ప్రైవేటీకరణ చేయాలన్న నిర్ణయాన్ని మధ్యతరగతి ప్రజలు ఆమోదించలేక పోతున్నారు. వరుసగా ప్రభుత్వ వైఫల్యాలు స్పష్టమౌతున్నాయి. దేశవ్యాప్తంగా బీజేపీ గ్రాఫ్‌ పడిపోతోంది. సమర్ధవంతమైన ప్రతిపక్షం లేకపోవడంతో ఇప్పటికి ఇంకా బీజేపీ ఆధిపత్యం కొనసాగుతోందన్న నివేదికలున్నాయి. ఈ దశలో చేతిలో ఉన్న రెండేళ్ళ పాలనా కాలాన్ని వదులుకోవడం మెరుగైన ఆలోచన కాదన్న సూచనలు బీజేపీలోనే అంతర్గతంగా వ్యక్తమౌతున్నాయి.
ఒకే దేశం.. ఒకే ఎన్నిక విధానం ద్వారా కేంద్రంలో అధికారంతో పాటు మెజారిటీ శాసనసభల్ని తమ గుప్పెట పట్టాలని బీజేపీ ఓ దశలో వ్యూహాలు సిద్ధం చేసింది. ఒకేసారి దేశం యావత్‌ ఎన్నికలు జరిగితే తమదే పైచేయి అవుతుందని భావించింది. 2022లో జమిలీని నిర్వహించాలని తలపోసింది. అయితే రాజకీయంగా ఈ చర్య తమకు సానుకూలమా లేక ప్రతికూలమా అన్న అంతర్మధనం పార్టీలో సాగింది. దీనిపై భిన్నాభిప్రాయాలు వెలువడ్డాయి. ఇప్పటికే లా కమిషన్‌ దీనిపై అధ్యయనం నిర్వహించింది. జమిలీ ఎన్నికలకు సంబంధించి నిర్వహణ, రాజ్యాంగ సవరణ, చట్టబద్ద ఇబ్బందుల్ని పరిశీలించింది. లా కమిషన్‌ నుంచి పూర్తిస్థాయిలో ఇంకా ఆమోదం రాలేదు. ఒకవేళ వచ్చినా లోక్‌సభ, రాజ్యసభలతో పాటు దేశంలోని 29 రాష్ట్రాల్లోని 20 రాష్ట్రాల శాసనసభలు ఈ ప్రతిపాదనను ఆమోదించాలి. అప్పుడే ఇది చట్టరూపం దాల్చుకుంది. ఇప్పటికి బీజేపీ, ఆ పార్టీ మిత్రపక్షాలతో కూడిన ప్రభుత్వాలు 17 రాష్ట్రాల్లో ఉన్నాయి. మరో మూడు రాష్ట్రాల మద్దతు అవసరం. ఇప్పుడు ఎన్నికలు జరుగుతున్న ఐదు రాష్ట్రాల్లో ఏ మూడు రాష్ట్రాల్లోనూ బీజేపీ అధికారంలోకొచ్చే అవకాశాల్లేవు. దీంతో జమిలీ ఎన్నికల అంశం చట్టరూపం దాల్చే పరిస్థితి కూడా కనిపించడం లేదు. వీటన్నింటిని పరిగణనలోకి తీసుకునే కేంద్రం ఐదు రాష్ట్రాల అసెంబ్లిd ఎన్నికల షెడ్యూల్‌కు గ్రీన్‌సిగ్నల్‌ ఇచ్చేసింది. అయితే ఈ చర్య బీజేపీలోకంటే తెలుగుదేశం వంటి కొన్ని పార్టీలకు ఆశనిపాతంగా మారింది. వారి ఆశలపై నీళ్ళు జల్లేసింది. 2024 వరకు ఎన్నికల కోసం ఎదురుచూడక తప్పదని తేల్చేసింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement