Tuesday, November 26, 2024

న్యూఢిల్లీ : గ్లాన్స్ చేతికి టిక్ టాక్

భారత్‌లో టిక్‌టాక్‌ కార్యకలాపాలను ప్రత్యర్థి గ్లాన్స్‌ సంస్థకు విక్రయించాలని టిక్‌టాక్‌ యాజమాన్య సంస్థ బైట్‌డ్యాన్స్‌ భావిస్తోందని బ్లూమ్‌బర్గ్‌ రిపోర్ట్‌ పేర్కొంది. జపాన్‌కు చెందిన సాఫ్ట్‌ బ్యాంక్‌కు ఈ మేరకు చర్చలు ప్రారంభించింది. సంప్రదింపులు ప్రాథమిక దశలో ఉన్నాయని ఈ వ్యవహారంతో సంబంధమున్నవర్గాలు చెప్పారని రిపోర్ట్‌ ప్రస్తావించింది. గ్లాన్స్‌ మాతృ, మొబైల్‌ అడ్వర్టైజింగ్‌ టెక్నాలజీ సంస్థ ఇన్‌మొబికి ఇప్పటికే రొపోసో యాప్‌ ఉంది. గతేడాది జులైలో టిక్‌టాక్‌పై కేంద్రం ప్రభుత్వం నిషేధం విధించిన తర్వాత రొపోసో యాప్‌కు అనూహ్యంగా ఆదరణ పెరిగిన విషయం తెలిసిందే. కాగా ఇన్‌మొబి, బైట్‌డ్యాన్స్‌ ఈ రెండు కంపెనీలకు సాఫ్ట్‌బ్యాంక్‌ మద్దతుదారుగా కొనసాగుతోందని రిపోర్ట్‌ వివరించింది. అయితే ఈ అంశంపై ఇన్‌మొబి, డైబ్‌డ్యాన్స్‌, సాఫ్ట్‌బ్యాంక్‌లు ఇప్పటివరకు స్పందించలేదు. భారత్‌లో సిబ్బందిని 2 వేలకు పైగా మంది సిబ్బందిని తొలగిస్తూ గత నెల్లో బైట్‌ డ్యాన్స్‌ నిర్ణయం తీసుకుంది. భారత్‌లో తిరిగి కార్యకలాపాలపై పునరుద్ధరించడంపై స్పష్టతలేదని ఉద్యోగులకు రాసిన లేఖలో బైట్‌డ్యాన్స్‌ పేర్కొన్న విషయం తెలిసిందే. కాగా గోప్యత, ఇతర నియమాల ఉల్లంఘనలకు పాల్పడుతున్న టిక్‌టాక్‌తోపాటు చైనాకు చెందిన మరో 58 యాప్‌లపై కేంద్ర ప్రభుత్వం నిషేధం విధించిన విషయం తెలిసిందే.

Advertisement

తాజా వార్తలు

Advertisement