Friday, November 22, 2024

న్యూఢిల్లీ : కలర్ ఫుల్ మార్స్

నాసా పంపిన ‘పర్సెవరెన్స్‌’ రోవర్‌ అంగారకుడి ఉపరితలానికి సం బంధించిన తాజా ఫొటోలను పంపింది. మార్స్‌ ఉపరితల స్థితిగతులు ఈ ఫొటో ల్లో స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఇంతటి స్పష్టతతో కలర్‌ ఫొటోలు సేకరించడం ఇదే తొలిసారి. భూమి నుంచి అంతరిక్ష నౌక తీసుకెళ్లిన రోవర్‌.. ఇప్పటికే హై-రెజ్యూ లేషన్‌ ఉన్న వీడియోను భూమికి పంపింది. రోవర్‌ అంగారకుడిపై కేబుల్స్‌ సాయంతో ల్యాండ్‌ అయ్యింది. ఆ సమయంలో ఆరు ఇంజిన్లు ఉన్న ఈ రోవర్‌ తన వేగాన్ని గంటకు 1.7 మైళ్లకు (2.7 కిలోమీటర్లు) తగ్గించుకుంది. ఈ ఫొటోను కూడా రోవర్‌ పంపగా నాసా విడుదల చేసింది. రోవర్‌ అంగారకుడిపై దిగుతున్న సమయంలో దుమ్ము లేవడం కూడా వీడియోలో చూడొచ్చని పర్సెవరెన్స్‌ చీఫ్‌ ఇంజినీర్‌ ఆడం స్టె ల్జ్నర్‌ వివరించారు. ఆ సమయంలో రోవర్‌.. ఉపరితలానికి కేవలం ఆరు అడుగుల (రెండు మీటర్లు) ఎత్తులో ఉన్నట్టు తెలిపారు. కెమెరా నుంచి పర్సెవరెన్స్‌కు డేటాను సరఫరా చేసేందుకు కర్లీ కేబుల్‌ను ఉపయోగించి నట్టు వివరించారు.. గంటకు వందల కిలో మీటర్ల వేగంతో.. సంక్లిష్ట వాతావర ణంలో పారాచూట్‌ చేస్తూ దిగుతున్న చిత్రాన్ని ఆర్బిటర్‌ పంపింది.
హై రెజ్యూలేషన్‌తో ఫొటోలు
పర్సెవరెన్స్‌ అంగారకుడి, జెజెరో క్రేటర్‌లో అడుగుపెట్టిన తరువాత.. చదునైన ప్రాంతానికి సంబంధించిన హై రెజ్యూలేషన్‌ కలర్‌ ఫొటోను భూమికి పంపింది. అక్కడే ఓ లోతైన ప్రాంతం ఉంది. కొన్ని వందల ఏళ్ల క్రితం అక్కడ సరస్సు లేదా నది వుండేదని తెలుస్తోంది. అయితే దీని వెడల్పు సుమారు 45 కిలో మీటర్ల వర కు ఉంది. ఇక రెండో కలర్‌ ఫొటోలో రోవర్‌ ఆరు చక్రాల్లో ఒకటి కనిపిస్తుంది. దాని పక్కనే అనేక రాళ్లు ఉన్నాయి. ఇవి 3.6 బిలియన్‌ ఏళ్ల కన్నా పురాతనమైనవిగా భావిస్తున్నట్టు నాసా చెప్పుకొచ్చింది. ఈ రాళ్లు అగ్ని పర్వత లేదా అవక్షేప మూలాన్ని సూచిస్తాయా అనేది తేలాల్సి ఉంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement