Sunday, November 24, 2024

న్యూఢిల్లీ : ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలపై సీఈసీ నిర్ణయం నేడు

ఐదు రాష్ట్రాల అసెంబ్లి ఎన్నికల నిర్వహణపై నేడు ఈసీ తుది నిర్ణయం వెల్లడించనుంది. ఈ మేరకు కేంద్ర ఎన్నికల సంఘం బుధవారం సమావేశం కానుంది. ఏయే రాష్ట్రాల్లో ఎప్పుడెప్పుడు? ఎన్నిదశల్లో పోలింగ్‌ నిర్వహించా లనే అంశంపై ఈభేటీలో నిర్ణయం తీసుకోనున్నారు. ఎన్నికల అధికారులు ఇప్పటికే బెంగాల్‌, అసోం రాష్ట్రాల్లో పర్యటించా రు. క్షేత్రస్థాయిలో ఎన్నికల ప్రక్రియకు ఏర్పాట్లపై మదింపు చేశారు. కాగా, నేడు మరొక బృందం తమిళనాడు, పుదుచ్చే రి, కేరళలలో పర్యటించనున్నారు. ఎన్నికల ఏర్పాట్ల గురించి రాష్ట్రాల అధికారులతో సమీక్షిస్తారు. బెంగాల్‌లో 6 నుంచి 8 దశల్లో పోలింగ్‌ నిర్వహించే అవకాశం ఉందని తెలుస్తోంది. అదేవిధంగా అసోంలో రెండు లేదా మూడు దశల్లో ఓటింగ్‌ నిర్వహించొచ్చని సమాచారం. కాగా, ఈ ఐదు రాష్ట్రాల్లో ఓటింగ్‌ లెక్కింపు ఒకేసారి చేపడతారు. ఏప్రిల్‌ చివరి నాటికి ఎన్నికల ప్రక్రియను ముగించాలన్న లక్ష్యంతో కేంద్ర ఎన్నికల సంఘం ఉన్నది.
దీంతో పశ్చిమబెంగాల్‌, అసోం, తమిళనా డు, కేరళ, పుదుచ్చేరిలో మార్చి, ఏప్రిల్‌ మాసాల్లో ఎన్నికల వేడి తీవ్రత రం కానుంది. ఇదిలావుండగా ఈ ఐదు రాష్ట్ల్రాల్లో ప్రధాన రాజకీయ పార్టీలన్నీ ఇప్పటికే ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభిం చాయి. తమిళనాడు, పశ్చిమబెంగాల్‌ ఎన్నికలపై జాతీయ స్థాయిలో ఆసక్తి నెలకొంది. ఐదు చోట్లా విజయం సాధించి, ప్రభుత్వాలను ఏర్పాటు చేయాలని భారతీయ జనతాపార్టీ పట్టుదలతో ఉంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement