Friday, November 22, 2024

న్యూఢిల్లి : వచ్చే ఏడాది నష్టం పూడుతుంది

వచ్చే ఆర్థిక సంవత్సరం 2021- 22లో 10.4 శాతం జీడీపీ వృద్ధి రేటుతో భారత్‌ దృఢంగా పుంజుకుంటుందని ఇం డియా రేటింగ్స్‌ అండ్‌ రీసెర్చ్‌ రిపోర్ట్‌ అం చనా వేసింది. మరుసటి ఆర్థిక సంవ త్స రం 2023లో భారత్‌ అర్థవంత మైన వృద్ధి రేటును సాధిస్తుందని పేర్కొంది. ఆర్థిక సంవత్సరం 2021లో జరిగిన నష్టం ఆర్థిక సంవత్సరం 2022లో అధికంగా పూడనుంది. కాబట్టిలో 2022లో వృద్ధిరే టును పెద్దగా పట్టించుకో కూడదు. ఆ తర్వాత ఏడాది 2023లో అర్థవంతమైన వృద్ధి రేటు నమోదుకా వొచ్చని ఇండియా రేటింగ్స్‌ ప్రధాన ఆర్థికవేత్త సునీల్‌ కుమా ర్‌ సిన్హా పేర్కొన్నా రు. వర్చువల్‌గా బుధ వారం ఆయన మాట్లాడారు. కోవిడ్‌ ముం దునాటి పరిస్థితిని బట్టి చూస్తే 2022 లో నమో దయ్యే వృద్ధిరేటు ట్రెండ్‌తో పోల్చితే కనిష్ఠంగానే ఉండనుందని ముఖ్య ఆర్థిక వేత్త డీకే పంత్‌ అన్నారు. మధ్య కాలి కంగా వృద్ధిరేటు క్షీణించనుం దని కంపెనీ వివరించింది. కార్మిక రంగంలో ప్రతి ఏడాది కొత్తగా ప్రవేశించే 10-12 మిలి యన్ల మంది కార్మికులకు ఉపాధి కోసం ఏడాది 8 శాతం చొప్పున వృద్ధిరే టును సాధించాల్సి ఉందని సిన్హా అంచనా వేశా రు. కార్మికుల ఏటేటా పెరుగు తోం దని ఆయన వివరించారు. ఆర్థిక సంవ త్సరం 2026 వరకు 6-7 శాతం వృద్ధిరేటు సాధ్య మని 15వ ఆర్థిక సంఘం అంచనా వేసిం ది. కాబట్టి 7 – 8 శాతం మధ్య వృద్ధిరేటు సవాలు కూడుకున్నదన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement