వరుసగా రెండు త్రైమాసికాల తర్వాత క్యు3లో భారత జీడీపీ సానుకూల వృద్ధి బాటపట్టింది. డిసెంబర్‌తో ముగిసిన త్రైమాసికంలో భారత జీడీపీ వృద్ధి రేటు 0.4 శాతంగా నమోద యింది. ప్రధానంగా వ్యవసాయం, సేవలు, నిర్మాణరంగాలు రాణించడంతో ఈ స్థాయి వృద్ధి నమోదయిందని కేంద్ర ప్రభుత్వం శుక్రవారం విడుదల చేసిన గణాంకాలు పేర్కొన్నాయి. దీంతో అనూహ్యంగా చవిచూసిన మాంద్యం పరిస్థితుల నుంచి భారత్ గట్టెక్కిందని నేషనల్ స్టాటస్టికల్ ఆఫీస్(ఎన్‌ఎస్‌వో) పేర్కొంది. ఈ మేరకు శుక్రవారం రెండవ ముందస్తు అంచనాలను శుక్రవారం విడుదల చేసింది. ఎన్‌ఎస్‌వో సమాచారం ప్రకారం.. వాణిజ్య, హోటల్ పరిశ్రమలు ఏకంగా 7.7 శాతం మేర పతనమయ్యాయి. ఆయా రంగాలపై కరోనా మహమ్మారి ప్రభావం ఇంకా కొనసాగు తూనే ఉంది. అయితే డిసెంబర్ త్రైమాసి కంలో సమీక్షాకాలం నాటికి వ్యవసా యరంగం 3.9 శాతం, ఉత్పాదక రంగం 1.6 శాతం చొప్పున వృద్ధి రేటు సాధించాయి. ఇక నిర్మాణ రంగం 6.2 శాతం వృద్ధి సాధిం చగా విద్యుత్, గ్యాస్, వాటర్ సప్లయి, ఇతర యుటిలిటీ సర్వీసులు 7.3 శాతం వరకు మెరుగు పడ్డా యి. 2019- 20 క్యు3 లో కాన్‌స్టంట్ (2011-12) ప్రైసెస్ రూ.36 .08 లక్షల కోట్లు కాగా.. 2020-21 క్యు3లో ఇది రూ.36.22 లక్షల కోట్లుగా ఉంది. అంటే 0.4 శాతం సానుకూల వృద్ధి నమోద ం ుుందని ఎన్‌ఎస్ వో పేర్కొంది. కాగా ప్రస్తుత ఆర్థిక సంవత్స రం 2019- 20లో దేశ జీడీపీ మైనస్ 8 శాతం మేర క్షీణించ వచ్చునని ఎస్‌ఎస్‌వో అంచనా వేసింది. కాగా జనవరి ముందస్తు అంచనాల ప్రకారం.. ఈ ఏడాది మైనస్ 7.7 శాతం మేర జీడీపీ క్షీణించనుందని పేర్కొన్న విషయం తెలిసిం దే. అయితే కరోనా ప్రభావం తో కొత్త సవాళ్లు ఎదురవు తున్నప్పటికీ పాజిటి వ్ వృద్ధి నమోదవ్వడం శుభప రిణామ మని ఆర్థికవేత్తలు పేర్కొంటు న్నారు. కాగా క్యు2లో భారత జీడీపీ మైనస్ 7.5 శాతం మేర క్షీణించ గా.. గతేడాది క్యు3లో జీడీపీ వృద్ధి రేటు 4.1 శాతంగా నమోదయిన విషయం తెలిసిందే.
Advertisement
తాజా వార్తలు
Advertisement