Friday, November 22, 2024

నేడు భారత పరిశ్రమల పితామహుడి జయంతి

ఈరోజు ఏ ఇంట్లో చూసినా టాటా ఉప్పు.. టాటా నానో.. టాటా ఫోన్.. టాటా టీ.. ఇంకా ధనవంతులకైతే టాటా వారి తాజ్ హోటల్స్.. ఇలా ప్రతిదీ టాటాతో ముడిపడి ఉంది. కానీ టాటా గ్రూప్ వ్యవస్థాపకుడు జమ్‌షెడ్జీ టాటా పుట్టినరోజు మార్చి 3. 182 ఏళ్ల క్రితం జన్మించిన ఆయన భారత పరిశ్రమల పితామహుడిగా ఎంతో పేరు, ప్రఖ్యాతులు పొందారు. జంషెడ్జీ టాటా 1839, మార్చి 3న దక్షిణ గుజరాత్‌లోని పార్సీ కుటుంబంలో నుస్సర్‌వాంజీ టాటా, జీవన్‌బాయి దంపతులకు జన్మించారు. జంషెడ్జీ టాటా పూర్తిపేరు జంషెడ్జీ నుసీర్‌వాంజీ టాటా. తన 14 ఏళ్ల వయసులో తండ్రితో కలిసి గుజరాత్‌ నుంచి ముంబైకి వచ్చి వ్యాపారం ప్రారంభించారు. ఒకవైపు డిగ్రీ చదువుతూనే మరోవైపు వ్యాపారాలపై దృష్టి సారించారు. విద్యార్థిగా ఉండగానే హీరాబాయిని వివాహమాడిన జంషెడ్జీ టాటాకు ఇద్దరు కుమారులు.. దోరాబ్జీ, రతన్‌ టాటా.

పత్తి, ఉక్కు పరిశ్రమలతో పాటు అనేక వ్యాపారాల ద్వారా భారతదేశ వ్యాపారాన్ని ప్రపంచానికి చాటిన పితామహుడు జంషెడ్జీ టాటా. ఆయన సాధించిన విజయాలలో జంషెడ్‌పూర్‌లోని టాటా ఐరన్ స్టీల్ వర్క్స్ సంస్థ ప్రసిద్ధి చెందింది. తాజ్ హోటల్‌కు ప్రాణం పోసింది ఆయనే. హోటల్ తాజ్‌ను 1903 డిసెంబర్‌లో రూ.4.21 కోట్ల వ్యయంతో నిర్మించారు. భారతదేశంలో విద్యుత్‌ ఉన్న మొదటి హోటల్ ఇదే కావడం విశేషం. డిగ్రీ పూర్తికాగానే తన తండ్రి నడుపుతున్న ఎక్స్‌పోర్ట్‌ ట్రేడింగ్‌ కంపెనీలో ఉద్యోగిగా చేరి తమ వ్యాపారాలను జపాన్‌, చైనా, యూరప్‌ దేశాలతోపాటు అమెరికాకు విస్తరించడంలో జంషెడ్జీ కీలకపాత్ర పోషించారు. 1868లో తానే స్వయంగా రూ.21 వేల మూలధనంతో ట్రేడింగ్‌ కంపెనీని ప్రారంభించి తన వ్యాపార సామ్రాజ్యాన్ని వేల కోట్ల రూపాయలకు తీసుకువెళ్లారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement