గ్రామాల్లో నావారు మంచానికి ఉన్న ప్రధాన్యతే వేరు. చిన్నపల్లల దగ్గర్నుంచి, ముసలివారు కూడా నవారు మంచంలో పడుకోవడానికి ఇష్టపడుతారు. అయితే రాను రాను నవారు మంచాలు తక్కువైపోతున్నాయి. కొత్తగా అందరు మోడ్రన్ మంచాలనే ఎక్కువగా వాడుతున్నారు. అయినప్పటికి నావారు మంచానికి ఉన్న ప్రధాన్యత స్పెషల్.. పల్లెటూరులో పొద్దంతా పనిచేసి అలసిపోయి అలా కాసేపు మంచంపై ఒరిగితే చాలు.. మనసుకు ఎంతో ప్రశాంతంగా అనిపిస్తుంది. అయితే ఊళ్లలో నవారు మంచం అల్లేవారు ఉంటారు. లేదంటే ఇంట్లోని వారే నవారును అల్లుకుంటారు. లేదా మంచం కొనాలంటే కనీసం ప్రస్తుతం ఓ 10 వేల రూపాయల వరకు ఖర్చవుతుంది.
ఇక న్యూజిలాండ్‌లో ను మన నవారు మంచి గుర్తింపు ఉంది. అక్కడ నవారు మంచానికి ఉన్న ధర తెలిస్తే షాక్ అవ్వాల్సిందే. అక్కడి అన్నాబెల్లె అనే ఓ ఈ కామర్స్ సైట్ ‘వింటేజ్ ఇండియన్ డేబెడ్’తో నవారు మంచానికి ఏకంగా 41, 297 రూపాయల ధర నిర్ణయించింది. వాస్తవానికి దీన ధర 61,980 ఉండగా డిస్కౌంట్ తర్వాత 41 వేలుగా ఉంది. ప్రస్తుతం ఈ మంచం ధర సోషల్ మీడియాలో వైరలవుతోంది. దీనిని చూసిన నెటిజన్లు మంచం ధర తెలిసి ఆశ్చర్యపోతున్నారు. అంత ధర వెచ్చించి కొనుగోలు చేస్తారా అని సందేహం వ్యక్తం చేస్తున్నారు.
ఇది కూడా చదవండి: ఆఫ్ఘనిస్థాన్ లో పరిస్థితులను ఎదుర్కోలేక బైడెన్ సర్కార్ చేతులెత్తేసింది: ట్రంప్