తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత మాత్రమే రాష్ట్రంలో వ్యవసాయం అభివృద్ధి చెందిందని మంత్రి జగదీశ్వరరెడ్డి అన్నారు. ప్రత్యేక రాష్ట్రంలోనే వ్యవసాయ రంగంలో తెచ్చిన
మార్పులతో అత్యంత ఎక్కువ లాభం పొందింది ఉమ్మడి నల్లగొండ జిల్లానే అన్నారు. నల్గొండ జిల్లా అనుముల మండలం అలీనగర్ సవిూపంలో బుధవారం నిర్వహించనున్న ముఖ్యమంత్రి ధన్యవాద సభకు సంబంధించిన ఏర్పాట్లను రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి జగదీశ్‌రెడ్డి ఈ రోజు పరిశీలించారు. ఉమ్మడి ప్రభుత్వంలో నాగార్జున సాగర్ కాలువ డిజైన్‌లో లోపాలతో కృష్ణా నది ఒడ్డున ఉన్న పొలాలకు నీరంద లేదన్నారు. చివరి భూముల పేరుతో 55 ఏండ్లు కాంగ్రెస్, టీడీపీ ప్రభుత్వాలు అన్యాయం చేశాయని మండిపడ్డారు. ప్రతి ఇంచు భూమికి నీరు అందించాలనే లక్ష్యంతో 60 వేల ఎకరాలకు సాగునీరందించే 13 లిప్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టులకు సీఎం కేసీఆర్ బుధవారం శంకుస్థాపన చేస్తారని తెలిపారు. ఈ క్రమంలో సీఎం కేసీఆర్‌కు ధన్యవాదాలు తెలిపేందుకు ఉమ్మడి జిల్లా రైతాంగం ఎదురుచూస్తోందని మంత్రి జగదీశ్ రెడ్డి పేర్కొన్నారు. రైతుల సంక్షేమాభివృద్ధి కోసం రాష్ట్ర ప్రభుత్వం అనేక చర్యలు తీసుకుంటోందని మంత్రి వెల్లడించారు. రాష్ట్రంలోని రైతాంగం అధైర్యపడాల్సిన అవరసరం లేదని, రైతులకు అన్ని విధాలుగా అండగా రాష్ట్ర ప్రభుత్వం
నల్గొండ : ప్రత్యేక తెలంగాణతోనే వ్యవసాయం అభివృద్ధి: మంత్రి జగదీశ్వర్ రెడ్డి
Advertisement
తాజా వార్తలు
Advertisement