ఉమ్మడి నల్లగొండ-ఖమ్మం-వరంగల్ జిల్లాల గ్రాడ్యుయేట్స్ ఎమ్మెల్సీ స్థానానికి టిఆర్ ఎస్ అభ్యర్ధి పల్లా రాజేశ్వరరెడ్డి నామినేషన్ దాఖలు చేశారు.. నామినేషన్ సందర్భంగా పార్టీ కార్యాలయం నుంచి కలెక్టరేట్ వరకూ భారీ ర్యాలీ నిర్వహించారు.. ఈ ర్యాలీలో మంత్రులు జగదీష్ రెడ్డి, సత్యవతి రాథోడ్, ఎర్రబెల్లి దయాకరరావుతో సహా పలువులు ఎమ్మెల్యేలు, నేతలు, కార్యకర్తలు పాల్గొన్నారు.. నామినేషన్ వేసిన అనంతరం పల్లా మీడియాతో మాట్లాడుతూ, త్యాగాల, పోరాటాల పురిటిగడ్డగా నిలిచిన ఈ జిల్లాలో పోరాట వారసులం తెలిపారు. సీఎం కేసీఆర్ 2014లో అధికారంలోకి వచ్చినప్పటి నుంచి లక్షా 31వేల ఉద్యోగాలు ఇచ్చారన్నారు. మోడీ కోటి ఉద్యోగాలు ఇస్తామని చెప్పి ఉన్న ఉద్యోగాలను తొలగిస్తున్నారన్నారు. ఉద్యోగాల కల్పన తమదని… ఉద్యోగాలను తుంచేసింది బీజేపీ అని విమర్శించారు. 2014 నుంచి సంక్షేమ పథకాలు కొనసాగాలంటే టీఆర్ఎస్ను గెలిపించాలని పల్లా రాజేశ్వర్రెడ్డి కోరారు.
మంత్రి జగదీష్ రెడ్డి మాట్లాడుతూ, . చచ్చిన పాము కాంగ్రెస్ అని,ఆ పార్టీ గురించి ఆలోచించాల్సిన అవసరం లేదన్నారు. తాచుపాములా కాటేసేందుకు వస్తున్న బీజీపీ గురించి ఆలోచించాలని రెడ్డి పేర్కొన్నారు. ఏడేళ్ల కాలంలో మోడీ చేసిందేమిటో… తెలంగాణలో కేసీఆర్ చేసిందేమిటో ప్రజలు ఆలోచించాలన్నారు. దేశంలో పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరలు పెంచి ప్రజల ఆదాయం తుంచేసింది బీజేపీయేనన్నారు
నల్గొండ : పల్లా నామినేషన్
Advertisement
తాజా వార్తలు
Advertisement