తెలంగాణ రాష్ట్రం అరుదైన ఘనత సాధించింది. దేశంలోనే అత్యధిక మొక్కలు నాటిన రాష్ట్రంగా రికార్డులకెక్కింది. కేంద్ర అటవీ శాఖ మంత్రి బాబుల్ సుప్రియో అధికారిక ప్రకటన చేశారు. దేశవ్యాప్తంగా 150.23 కోట్ల మొక్కలు నాటగా కేవలం ఒక్క తెలంగాణ రాష్ట్రంలోనే 38.17 కోట్ల మొక్కలు నాటినట్లు కేంద్ర మంత్రి వెల్లడించారు. అంతరించిపోయిన అడవుల విస్తీర్ణం పెంపునకు ప్రభుత్వం యజ్ఞంలా తెలంగాణకు హరితహారం కార్యక్రమాన్ని చేపట్టింది.
ఈ విషయాన్ని తన ట్విటర్ ద్వారా తెలుపుతూ టీఆర్ఎస్ రాజ్యసభ సభ్యుడు సంతోష్ కుమార్ హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా సీఎం కేసీఆర్‌కు శుభాకాంక్షలు తెలిపారు. సీఎం కృషి వల్లే ఈ ఘనత సాధ్యమైందని ఆయన అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన హరిత హారం కార్యక్రమం, సీఎం కేసీఆర్ స్ఫూర్తితో ప్రారంభించిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ ప్రోగ్రామ్‌లలో భాగంగా 2019-20 సంవత్సరంలో 38 కోట్ల మొక్కలను నాటినట్టు సంతోష్ ట్వీట్ చేశారు.