తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్ గా దేత్తడి హారికను నియమించి ఒక్కరోజైనా గడవకముందే వివాదం మొదలైంది. ఉమెన్స్ డే సందర్భంగా తెలంగాణ రాష్ట్ర టూరిజం బ్రాండ్ అంబాసిడర్ గా హారిక ను నిర్మించారు టూరిజం కార్పొరేషన్ చైర్మన్ ఉప్పల శ్రీనివాస్ గుప్తా. అయితే మంత్రి శ్రీనివాస్ గౌడ్, సీఎంవో అధికారులకు తెలపకుండా హారిక ను నిర్మించారట ఉప్పల శ్రీనివాస్..దీంతో ఈ అంశానికి సంబంధించి ప్రభుత్వ అధికారులు శ్రీనివాస్ గుప్తా ను మందలించిన ట్లు ఇచ్చినట్లు తెలుస్తోంది. అంతేకాదు టూరిజం శాఖ వెబ్సైట్ నుంచి హారిక వివరాలను అధికారులు తొలగించారు. అయితే అంబాసిడర్ గా నియామకం చేసిన తర్వాత ఇలా వివరాలు తొలగించడం చర్చనీయాంశంగా మారింది. కొందరు రాజకీయ విశ్లేషకులు ప్రతిష్టాత్మకమైన తెలంగాణ టూరిజం శాఖ ఈ వ్యవహారంపై మండిపడుతున్నారు.
Advertisement
తాజా వార్తలు
Advertisement