ఏడేళ్లలో అపోహలు పటాపంచలు…
ఆంధ్రప్రదేశ్‌లో చీకట్లు… తెలంగాణలో వెలుగులు
మా దగ్గరా పార్టీ పెట్టండి…
తెరాసకు ఆంధ్రోళ్ల స్వాగతం
కేసీఆర్ చెప్పిన ప్రతీది జరిగింది.. ఇదీ జరుగుతది
వెనుకబడిన ప్రతీవర్గాన్ని ఆదుకుంటాం
కేంద్ర ఎన్నికలసంఘం హద్దుమీరుతోంది
కేసీఆర్ సభ పెట్టొద్దు.. ఇది ఏం కథ
నవంబర్ 4 తర్వాత దళితబంధు గెల్లు ద్వారానే ఇస్తాం
టీఆర్‌ఎస్ ఎంతో శక్తివంతంగా మారింది
తెలంగాణ కోసమే నా జీవితం పునరంకితం
ప్లీనరీలో గులాబీదళపతి, సీఎం కల్వకుంట్ల చంద్రశేఖరరావు అధ్యక్షోపన్యాసం
హైదరాబాద్, ఆంధ్రప్రభ: ప్రపంచ ఉద్యమాలకే తెలంగాణ ఉద్యమం కొత్త భాష్యాన్ని, బాటను నేర్పిందని, తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం సందర్భం గా రేకెత్తించిన అపోహలు, అనుమానాలు అన్నింటినీ ఏడేళ్లలో పటా పంచలు చేయగలిగామని ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు అన్నారు. సోమవారం హైటెక్స్‌లోని హెచ్‌ఐసీసీలో టీఆర్‌ఎస్ రాష్ట్ర ప్రతి నిధుల మహాసభ ఘనంగా జరిగింది. ఈ సభలో టీఆర్‌ఎస్ అధ్యక్షుడిగా ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావును ఏకగ్రీవంగా ఎన్నుకున్నట్లు హర్షధ్వానాల మధ్య ప్రకటించగా, కేసీఆర్ అధ్యక్షోపన్యాసం చేశారు. 2001లో కొండా లక్ష్మణ్ బాపూజీ నివాసంలోని జలదృశ్యం ఆవరణలో గులాబీ జెండా ఎగిరింది. కొద్దిమంది మిత్రులతోనే స్వాతంత్య్ర పోరాటం తరహాలో ప్రారంభమైంది. నాడు గమ్యం మీద స్పష్టత లేదు. అగమ్యగోచర పరిస్థితి. తెలంగాణ ఉద్యమం ప్రారంభించినపుడు అపోచహలు, అనుమా నాలు. విశ్వాస రాచహత్య పరిస్థితీ ఉండేది. గాంధీజీ ఎన్నో ఆందోళన పిలు పులు విఫలమయినా పోరాటాన్ని ఆపలేదు. జలియన్ వాలా బాగ్ తర్వాత కూడా స్వాతంత్య్ర పోరాటం సాగింది. తెలంగాణ ఉద్యమం కూడా అలాగే సాగింది. రాజీలేని పోరాటమే తెలంగాణ సాధిస్తుందని ఆనాడే కవిత రాశా. సిపాయి తిరుగుబాటు విఫలమైందని అనుకుంటే.. వచ్చేదా స్వాతంత్య్రం అని కవిత రాసిన. శాంతియుత మార్గంలోనే తెలంగాణ సాధించుకున్నం. రాజ్యసభలో తెలంగాణ బిల్లు ఆమోదం పొందిన సమయంలో కూడా సమైక్యవాదులు అపనమ్మకాన్ని సృష్టించే ప్రయత్నం చేసినా దాన్ని అడ్డు కున్నాం. పాలనలో ఏడేళ్ళ నుంచి ఎనిమిదేళ్లలోకి ప్రవేశించాం. అభివృద్ధికి సామాజిక స్పృచహ జోడించడం క్లిష్టమైన ప్రక్రియ. అయితే తెలంగాణలో సక్సెస్ అయ్యాం. ఃఃతెలంగాణ కారు చీకటి అవుతుందని, నక్సలైట్ల రాజ్యం అవుతుందని చెప్పిన వారికి మనం పాలనతో సమాధానం చెప్పాం. కేంద్ర ప్రభుత్వ గణాంకాలు మన అభివృద్ధిని చాటుతున్నాయి. తలసరి విద్యుత్ వినియోగంలో, తలసరి ఆదాయం వృద్ధిలో తెలంగాణ జాతీయ స్థాయి కన్నా ముందుంది. ఏ రంగాల్లో అపోచహలు వ్యక్తం అయ్యాయో ఆ రంగాల్లో విజయం సాధించి చూపాము. నంబర్‌వన్‌గా నిలిచాం. మన రాష్ట్రంలో అమలుచేస్తున్న పథకాలనే దేశమంతా కాపీ కొడుతున్నారు. మనకు కరెంట్ ఉండదని, చీకట్లలో మగ్గుతామని అప్పటి సీఎం కిరణ్‌కుమార్ రెడ్డి చెప్పారు. విడిపోయినా మనం బాగానే ఉన్నాం. కరెంట్ సమస్య లేకుండా చేసుకున్నం. ఇపుడే మనమే వెలుగుల ఉన్నం. వాళ్ళే కరెంట్ సమస్యలతో చీకట్ల ఉన్నరు. మనం విడిపోయినపుడు ఏపీ తలసరి ఆదాయం రూ.1.70లక్షల అయితే తెలంగాణది రూ.2.35లక్షలకు పెరిగింది. ఏపీ అట్లనే ఉంది.
ఆంధ్రాలో పార్టీ పెట్టాలని వేల విజ్ఞప్తులు
దళితబంధు ప్రకటించాక ఆంధ్రా నుండి వేల విజ్ఞప్తులు, ఫోన్లు వస్తున్నాయి. ఆంధ్రాలో కూడా టీఆర్‌ఎస్ పార్టీ పెట్టండి.. మేం గెలిపించుకుంటాం. మీ పథకాలు మాకు కావాలి అని అంటున్నారు. తెలంగాణ పథకాలుతమ రాష్ట్రంలో ప్రవేశ పెట్టాలని కర్ణాటక, మహారాష్ట్రలోని ప్రజలు కోరుతున్నారు. నాందేడ్ జిల్లా ఐదు నియోజక వర్గాల ప్రజలు తెలంగాణలో కలుస్తామంటున్నరు. రాయచూరు బీజేపీ ఎమ్మెల్యే తెలంగాణ పథకాలు మెచ్చుకుని తమ రాష్ట్రంలో వాటిని ప్రవేశ పెట్టాలని అక్కడి మంత్రి సమక్షంలోనే కోరారు. ఇంతగా తెలంగాణ అభివృద్ధి చెందడం నా ఒక్కడి వల్ల సాధ్యపడలేదు. ఇందులో అందరి కృషి ఉంది. సర్పంచ్ నుంచి పై వరకు కృషి చేసిన ప్రజా ప్రతినిధులకు కృతజ్ఞతలు. ఉత్తరాది నుండి వేల సంఖ్యలో కూలీలు వచ్చి పనిచేస్తున్నరు. నాట్ల పనుల్లో, వ్యవసాయ పనుల్లో, హమాలీ పనుల్లో అంతా పొరుగురాష్ట్రాల వారే. మనం చేయలేనంత పని సృష్టించబడింది. ఒకప్పుడు ఐటీఎగుమతులు రూ.50 వేల కోట్లు ఉండేవి. ఇపుడు లక్షా 50 వేల కోట్లకు పెరిగినయి. ఇలా ప్రతీరంగంలోనూ అద్భుత ప్రగతి సాధించాం.
కిరికిరిగాళ్ళు.. కిరాయిగాళ్ళకు అదరం
కాంగ్రెస్, బీజేపీలు డిపాజిట్లు కోల్పోయే పార్టీలు. టీఆర్‌ఎస్ మాత్రమే తెలంగాణ అంతటా యూనిఫామ్‌గా ఉన్న పార్టీ. టీఆర్‌ఎస్ మాత్రమే తెలంగాణకు శ్రీరామ రక్ష. ఇదే ధృతి ఉధృతి కొనసాగాలి. మనకు బాస్‌లు తెలంగాణ ప్రజలే. చహ కమాండ్ ఎవ్వరూ లేరు. కాంగ్రెస్, బీజేపీ నేతలు ఢిల్లిసకి గులాంలు. ఏ కార్యక్రమం చేపట్టినా వారికి ఢిల్లిస అనుమతి కావాలి. కిరికిరి గాళ్ళు, కిరాయి గాళ్లకు టీఆర్‌ఎస్ అదిరి పోయే పార్టీ కాదు. బలమైన ఆర్థిక శక్తిగా కూడా టీఆర్‌ఎస్ ఎదిగింది. 400 కోట్ల రూపాయల ఫిక్డ్స్ డిపాజిట్‌లు టీఆర్‌ఎస్‌కు ఉన్నాయి. రెండు కోట్ల రూపాయలు నెలకు ఆదాయం వస్తుంది. టీఆర్‌ఎస్ తెలంగాణ ప్రజలు చూపిన ప్రేమకు తిరిగి ప్రేమను అందించింది.
కేంద్రం ఎన్నికల సంఘం.. ఏం పద్దతి ఇది
భారత ఎన్నికల సంఘం రాజ్యాంగ వ్యవస్థగా వ్యవచహరించాలి. గౌరవాన్ని నిలబెట్టుకోవాలి. ఈ దేశంలో ఒక సీనియర్ రాజకీయ నాయకుడిగా, బాధ్యత గల పార్టీ అద్యక్షుడిగా, ఒక ముఖ్యమంత్రిగాభారత ఎన్నికల సంఘానికి ఒక సలహా ఇస్తున్నాను. చిల్లరమల్లర ప్రయత్నాలు మానుకోవాలని చచహచ్చరిస్తున్నాను. కేసీఆర్ సభ పెట్టొద్దు ఇది ఏం కథ. ఇది ఒక పద్ధతా కొందరు దిక్కుమాలిన రాజకీయాలు చేస్తున్నారు. నాగార్జున సాగర్ సభ పెట్టొద్దంటూ చహకోర్టులో కేసులు వేశారు. చహుజూరాబాద్‌లో సభ నిర్వచహంచొద్దంటూ ప్రయత్నాలు చేస్తున్నారు. మన పార్టీ నాయకులు చాలా మంది చహుజూరాబాద్ పోరాటంలో ఉన్నారు. మీరు సభలో ఒక్క మాట చెప్పండి సార్.. లైవ్‌లో అందరూ చూస్తరు అని చెప్పారు. చహుజూరాబాద్ దళితులు అదృష్టవంతులు. ఈసీ ఏం చేసినా నవంబర్ 4 తర్వాత దళితబంధు అమలు జరిగి తీరుతోంది. నవంబర్ 4 వరకు దళిత బంధు అమలును ఆపగలదు. చహుజూరాబాద్‌లో గెల్లు శ్రీనివాస్ గెలిచి తీరుతాడు. గెల్లు శ్రీనివాస్‌ను చహుజూరాబాద్ ప్రజలు దీవించి, ఆశీర్వదిస్తారు. రాష్ట్రమంతటా దళిత బంధును అమలు చేస్తాం. నవంబర్ డిసెంబర్‌లో పూర్తిస్థాయిలో అమలుచేస్తాం. దళిత బంధు అమలును చూడడానికి 118 నియోజకవర్గాల నుంచి జనవరిలో బస్సుల్లో చహుజురాబాద్ వస్తారు. నేను కూడా దళిత బంధు అమలు అయ్యే మిగతా నియోజక వర్గాల్లో త్వరలోనే పర్యటిస్తా. మార్చి కల్లా దళిత బంధు పైలట్ ప్రాజెక్టు కింద అన్ని నియోజకవర్గాల్లో అమలు చేస్తాం.
ప్రతీ అసెంబ్లిస నియోజకవర్గంలో పార్టీ ఆఫీస్
ప్రస్తుతం జిల్లా పార్టీ కార్యాలయాలన్నీ పూర్తిచేసుకున్నం. హైదరాబాద్, వరంగల్ తప్ప అన్ని జిల్లాల్లో పార్టీ ఆఫీసులు రెడీ అయినయి. తర్వాత దశలో ప్రతి అసెంబ్లిస నియోజకవర్గంలో పార్టీ కార్యాలయాన్ని కడుతం. ఢిల్లిసలో పార్టీ కార్యాలయాన్ని 8 నుంచి పది నెలల్లో పూర్తి చేస్తాం. ఎనిమిది నెలల పాటు టీఆర్‌ఎస్ శ్రేణులకు కఠోర శిక్షణ ఇస్తాం. తెలంగాణ కోసమే నా జీవితం పునరంకితం. పార్టీ శ్రేణులు కూడా తెలంగాణ అభివృద్ధిలో అంకిత భావాన్ని క్రమశిక్షణను ఇలాగే కొనసాగించాలని కోరుకుంటున్నా అని సీఎం అన్నారు.
మన పథకాలు దేశానికే స్ఫూర్తి!
ప్రతీప శక్తులు అపుడు ఇప్పుడూ ఎప్పుడూ ఉంటాయి. అన్నిటిని అధిగమించి ముందుకు పోతున్నాం. సాగునీటి ప్రాజెక్టులకు కోర్టుల్లో అడ్డంకులు సృష్టించారు. వాటిని అధిగమిం చాం. సెక్రటేరియట్ అంటే కేసులు. యాదాద్రి కడతం అంటే కేసులు. మిషన్ భగీరథ అంటే కేసులు. తెలంగాణలో కులం. మతం అనే ఇరు కైన ఆలోచన మాకు లేదు. దళితబంధు ఓ సా మాజిక స్వాంతన పథకం. ఇది దేశానికి స్ఫూర్తి. రైతు బంధు ప్రారంభించినపుడు అనుమానాలు వ్యక్తం చేశారు. ఇపుడు కూడా దళిత బంధుపై అవాకులు చవాకులు పేలుతున్నారు. దళిత బంధుకు అయ్యేది లక్షా 70 వేల కోట్ల రూపాయలు తెలంగాణకు ఓ పెద్ద లెక్క కాదు. 2028 కల్లా తెలంగాణ బడ్జెట్ నాలుగు లక్షల కోట్లకు చేరుతుంది. తలసరి ఆదాయం తొమ్మిది లక్షల రూపాయలు చేరుతుంది. ఈ మధ్య ఢిల్లిస వెళ్ళినపుడు కొందరు సీఎంలు ఇన్ని డబ్బులు అన్ని పథకాలకు ఎలా తెస్తున్నారని అడిగారు. దానికి సాచహసం కావాలి. తెలంగాణ ఉద్యమం మొదలు పెట్టినప్పుడు సాహసంతో ముందుకు సాగి విజయం సాధించాం. దళిత బంధును కూడా నూటికి నూరు పాళ్లు అమలు చేస్తాం. ఇతర వర్గాలకు కూడా ఏదైనా చేయాలంటే అది టీఆర్‌ఎస్ వల్ల మాత్రమే సాధ్యం. రాబోయే ఏడేండ్లలో బడ్జెట్ల ద్వారా మొత్తం రూ.23 లక్షల కోట్లు ఖర్చు పెడుతాం. దళిత బంధుతోనే ఆగిపోం.. ఎన్నో కార్యక్రమాలు చేపడుతాం. అట్టడుగున ఉన్నందునే దళితులకు మొదట కార్యక్రమం చేపట్టాం. దళితబంధుపై పెట్టే పెట్టుబడి వృథా కాదు. దళిత బంధు రాష్ట్ర ఆర్థిక పురోగతికి తోడ్పాటునిస్తుంది. ఈ పథకం ద్వారా సంపద జరుగుతోంది. 70 ఏండ్ల కాంగ్రెస్, బీజేపీ పాలనలో ఎప్పుడైనా ఇలాంటి ఆలోచన చేశారా అని ప్రశ్నించారు.