హైదరాబాద్ : రేపు తెలంగాణ మంత్రివర్గ సమావేశం నిర్వహించనున్నారు. సీఎం రేవంత్రెడ్డి అధ్యక్షతన సెక్రటేరియెట్లో నిర్వహించే ఈ భేటీలో మంత్రులు పాల్గొననున్నారు. ఈ సమావేశంలో రైతు రుణమాఫీ, రైతు భరోసా, అసెంబ్లీ సమావేశాల నిర్వహణపై చర్చించే అవకాశం ఉందని తెలుస్తోంది.
అలాగే రాష్ట్ర చిహ్నం, తెలంగాణ తల్లి విగ్రహ ఏర్పాటుపై కూడా చర్చించనున్నట్లు సమాచారం. ఇటీవల లోక్సభ ఎన్నికలు పూర్తయ్యాయి. కాగా, ఎన్నికల కోడ్ కూడా ముగియడంతో ఈ భేటీకి ప్రాధాన్యత సంతరించుకుంది.
- Advertisement -