Friday, November 22, 2024

తెలంగాణ భవన్ లో మరోసారి అగ్నిప్రమాదం

తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీ కార్యాలయం తెలంగాణ భవన్‌లో మరోసారి అగ్నిప్రమాదం సంభవించింది. టీఆర్ఎస్ కార్యకర్తలు చేసుకుంటున్న సంబరాల్లో అపశ్రుతి దొర్లడంతో ఈ ప్రమాదం చోటు చేసుకుంది.. నాగార్జున సాగర్ ఉప ఎన్నికల్లో టీఆరెఎస్ అభ్యర్థి నోముల భగత్ గెలుపు దిశగా పయనిస్తున్నాడు. దీంతో మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ఆధ్వర్యంలో సంబరాలు జరుపుకుంటున్నారు. సంబరాలు ఉత్సాహంగా జరుపుకుంటున్న సమయంలో ఉన్నట్టుండి ఈ అగ్ని ప్రమాదం జరిగింది. కార్యకర్తలు సంబరాల్లో అత్యుత్సాహం ప్రదర్శించి బాణసంచా కాల్చారు. బాణాసంచా నిప్పు రవ్వలు కాస్తా పైకప్పుపై పడ్డాయి. వెంటనే మంటలు అంటుకున్నాయి. గతంలో కూడా సంబరాలు చేసిన సందర్భంగా అగ్నిప్రమాదం జరిిగింద. దీంతో టీఆర్ఎస్ కార్యకర్తలు సంబరాలకు బ్రేక్ వేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement