Friday, November 22, 2024

తెలంగాణ ప్రగతి స్వాప్నికుడు కేసీఆర్

భవిష్యత్‌ తెలంగాణ గురించి కలలు కనడమే కాదు.. వాటి సాకారానికి ముఖ్యమంత్రి కేసీఆర్‌ అహర్నిశలు శ్రమిస్తున్నారు. సాగునీటి పథకాలు, సంక్షేమ పథకాలకు ఉద్యమ సమయంలోనే రూపకల్పన చేశారు. ఇప్పుడు తెలంగాణ ప్రజానీకం చూస్తున్న అభివద్ధికి ఆనాడే పథక రచన జరిగింది. ఆయన కలలు ఫలించి… రాష్ట్రం ప్రగతిపథంలో దూసుకెళ్తున్నది. ఇప్పుడిది దేశానికే ఆదర్శంగా నిలుస్తున్నదని రాజ్యసభ సభ్యుడు జోగినపల్లి సంతోష్‌ కుమార్‌ చెబుతున్నారు. ఆ వివరాలు ఆయన మాటలలోనే….

కేసీఆర్‌ గారి దార్శనికత ఒక్క వాక్యంలో చెప్పా లంటే… ‘నిద్రలో కలగనడం కాదు… నిన్ను నిద్రపోని వ్వనిదే నిజమైన స్వప్నం’…అన్న మాజీ రాష్ట్రపతి, మహోన్నత శాస్త్రవేత్త అబ్దుల్‌ కలామ్‌ గారి మాటలు సరిగ్గా సరిపోతాయి. ప్రత్యేక తెలంగాణ ఉద్యమాన్ని ప్రారంభించే సమయం నుంచే ఆయన తెలంగాణ గురించి ఇలాంటి కలలే కన్నారు. ఇప్పుడు తెలంగాణ అన్ని రంగాలలో అభివృద్ధి పథంలో దూసుకు పోతున్నది. దేశంలో అత్యంత వేగంగా అభివృద్ధి సాధిస్తున్న రాష్ట్రంగా నిలిచింది. పారిశ్రామిక ప్రగతి, వ్యవసాయరంగం అభివృద్ధి సమతూ కంగా సాగుతున్నది. కేసీఆర్‌ కాకుండా మరోకరి వల్ల ఈ విజయాలు సాధ్య మయ్యేవికావని నేను గట్టిగా విశ్వసిస్తాను.
కాళేశ్వరం ఎత్తిపోతల పథకం, కొండపోచమ్మ రిజర్వాయర్‌, మల్లన్నసాగర్‌, మిడ్‌ మానేరు, డిండి ప్రాజెక్టుల ప్రతిపాదనలు 2014లో టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాతే వచ్చాయని చాలా మంది అనుకుంటారు. కానీ..అది నిజం కాదు. తెలంగాణలోని ప్రతి ఎకరాన్ని సాగునీటితో తడపాలని కేసీఆర్‌ గారు 20 ఏళ్ల క్రితమే తల పెట్టారు. అందుకు సంబంధించిన ప్రణాళికలు కూడా అప్పుడే సిద్ధం చేశారు.
పాలమూరు రంగారెడ్డి లిఫ్ట్‌ ఇరిగేషన్‌ పథకం కేసీఆర్‌ దార్శనికతకు నిదర్శనం. ఒకప్పుడు మహబూబ్‌నగర్‌ జిల్లాకు కరవు జిల్లాగా పేరుండేది. నాడు బీడుపడిన భూములు నేడు పచ్చదనంతో కలకలలాడుతున్నాయి. పాడిపంటలతో ఇంటింటా సిరిసంపదలు తులతూగుతున్నాయి. ఒకప్పుడు ఈ జిల్లానుంచి జనం పొట్టచేతపట్టుకొని ఉపాధి కోసం దూరదూర ప్రాంతాలకు వలస వెళ్లేవారు. అయితే.. ఇప్పుడదంతా గత చరిత్ర. ఇప్పుడక్కడ ఎవరూ ఒక అంగుళం భూమిని కూడా విక్రయించడం లేదు. నిరంతరం సాగు నీరు అందడంతో అక్కడి భూములు ఇప్పుడు సిరిలుపండించే మాగాణంగా మారిపోయాయి.
ప్రధాని నరేంద్రమోడీకి స్ఫూర్తి దాయకంగా నిలిచిన మిషన్‌ భగీరథ పథకానికి ‘సిద్దిపేట సమగ్ర మంచినీటి సరఫరా పథకం’ సాధించిన విజయమే మాతృక అని మీకు తెలుసా. కేసీఆర్‌ గారు 1998లో సిద్దిపేట ఎమ్మెల్యేగా ఉన్న ప్పుడే… ఈ పథకాన్ని రూపొందించి, అమలు జరిపారు. అది అద్భుత విజయాలు సాధించింది. ప్రధాని మోడీని మిషన్‌ భగీరథ ఎంతగానో ఆకట్టుకున్నదని నేను గర్వంగా చెప్పగ లను. ఈ పథకాన్ని ఆమూలాగ్రం అధ్యయనం చేయమని ఆయన తన అధికారులను ఆదేశించారు. అంతేకాదు… దీని స్ఫూర్తితోనే 2019 ఆగస్టు 15న ‘జల్‌ జీవన్‌ మిషన్‌’ పేరిట ఓ పథకాన్ని ప్రకటించారు. దేశంలోని ప్రతి పట్టణం, ప్రతి గ్రామంలోని ఇంటింటికీ… సురక్షిత మంచి నీరు సరఫరా చేయ డమే ప్రధాని ప్రకటించిన పథకం లక్ష్యం. ప్రధాని హైదరా బాద్‌ వచ్చినప్పుడే ఈ పథకం సాధించిన విజయా లను చూసి ముగ్ధుడై… దేశమంతటికీ ఇలాంటి పథకాన్నే అమలు జరపాలని నిర్ణయించారు. కేసీఆర్‌ గారు తన విజన్‌ నుంచి ప క్కకు వైదొలగడం ఇన్నేళ్ల జీవితంలో నేనెప్పుడూ చూడలేదు.
2006లో వరంగల్‌ జిల్లా ములుగు మండలంలోని భాగ్యతండాలో అగ్నిప్రమాదం సంభవించినప్పుడు కేసీఆర్‌ గారు బాధితులను పరామర్శించడానికి వెళ్లారు. అక్కడ ఆయన ఇల్లుకాలి సర్వంకోల్పోయిన ఓ తండ్రిని పరామర్శిం చారు. కూతురు పెళ్లికోసం దాచుకున్న మొత్తం అగ్నికి ఆహూతయ్యిందని ఆ తండ్రి విలపించడం కేసీఆర్‌గారిని కలచి వేసింది. వెంటనే ఆయన రూ.50,000లను తీసి ఆ తండ్రి చేతిలో పెట్టి.. కూతురు పెళ్లికి ఉపయోగించమన్నారు. ఆడ పిల్లల పెళ్లి కోసం తల్లిదండ్రులకు ఆర్థిక సహాయం చేయాలని అప్పుడే కేసీఆర్‌ గారు ఓ నిర్ణయానికి వచ్చారు. ఆనాటి నిర్ణ యమే ఇప్పుడు కల్యాణ లక్ష్మిగా, షాదీముబారక్‌గా నిరుపేద తల్లిదండ్రులకు వరప్రసాదంగా మారింది. ఆడపిల్ల పెళ్లికి ఇప్పుడు దాదాపు లక్ష రూపాయలను తెలంగాణ ప్రభుత్వం సహాయంగా అందిస్తున్నది. పల్లే అయినా… పట్టణమైనా.. సమగ్ర ప్రగతి సాధించాలన్నదే గౌరవ ముఖ్యమంత్రిగారి అభి మతం. అందుకే.. పల్లె ప్రగతి, పట్టణ ప్రగతి వంటి కార్యక్రమా లు చేపట్టారు. ఇవి నాణానికి రెండు పార్శ్వాల్లాంటివి. ఈ రెండు ప్రాంతాల ప్రగతి.. ఇప్పుడు తెలంగాణ సమగ్రాభివృద్ధికి బాటలు వేస్తున్నది.
తెలంగాణ హరిత హారానికి ఉపోద్ఘాతమేమీ అక్కరలేదు. మనందరిలో చైతన్యాన్ని రగిలించి, ఒక్కటిగా కలిపిన గ్రీన్‌ ఇండియా చాలెంజ్‌కు ఇదే స్ఫూర్తి అని చెప్పవచ్చు. కేసీఆర్‌ గారు ఒక పవిత్ర ఉద్యమంగా సిద్దిపేట పరిసరాలలో లెక్కలేనన్ని మొక్కలు నాటారన్న విషయం చాలా మందికి తెలియదు. ఇప్పుడా ప్రాంతమంతా హరిత శోభతో విరాజిల్లుతున్నది.
కేసీఆర్‌ గారికి అన్ని అంశాలపైనా సమగ్ర అవగాహన ఉంది. ప్రతి అంశాన్ని సంపూ ర్ణంగా తెలుసుకోవడానికి ఆయన ఎల్లవేళలా ప్రయత్నిస్తుంటారు. విద్యాశక్తి ఎంతటి గొప్పదో ఆయనకు తెలుసు. అందుకే.. ఆర్థి కంగా వెనుకబడిన వారికోసం గురుకుల పాఠశాలలను, ముస్లిం బాలికల కోసం ప్రత్యేక పాఠశాలలను ప్రారంభించారు. రాష్ట్రం కోసం, దేశం కోసం ఆయన కన్న మహోన్నత కలలను సాకారం చేయడంలో భాగంగానే ఈ విద్యాలయాలు స్థాపించారు. అనుక్షణం ‘నా తెలంగాణ’ అంటూ పలవ రించే కేసీఆర్‌ గారి స్వప్నాల గురించి, వాటిని సాకారం చేసుకోవడానికి ఆయన చేస్తున్న ప్రయత్నాల గురించి నేను రాయా లంటే.. ఈ ఒక్క ఆర్టికల్‌ సరిపోదు. కేసీఆర్‌ గారి నాయకత్వంలో తెలం గాణ ప్రగతి అప్రతిహతంగా సాగుతూనే ఉంటుంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement