Tuesday, November 26, 2024

తల్లి కాబోతున్న శ్రేయ

ప్రముఖ గాయని శ్రేయా ఘోషల్ తల్లి కాబోతుంది. ‘బేబీ శ్రేయాదిత్య’ కమింగ్ అంటూ ఆమె శుభవార్తను సోషల్ మీడియాలో అభిమానులతో పంచుకుంది. తమ జీవితంలో సరికొత్త అధ్యాయాన్ని ఫ్యాన్స్‌తో పంచుకోవడం తనకు ఎంతో ఆనందంగా ఉందని తెలిపింది. ఈ శుభ సమయంలో ప్రేక్షకుల దీవెనలు, ఆశీస్సులు, ప్రేమ తనకు కావాలని ట్వీట్ చేసింది.

కాగా 2015, ఫిబ్రవరి 5న తన మిత్రుడు శైలాదిత్యను శ్రేయా ఘోషల్ పెళ్లాడింది. టాలీవుడ్‌లో ఎన్నో సూపర్ డూపర్ హిట్ పాటలను ఆమె పాడింది. తెలుగులోనే కాకుండా హిందీ, మలయాళం, కన్నడ, తమిళం, బెంగాలీ, పంజాబీ, మరాఠీ, అస్సామీ భాషల్లో ఎన్నో పాటలకు ఆమె తన గాత్రాన్ని అందించింది. తన మధురమైన గాత్రంతో ప్రశంసలతో పాటు జాతీయ అవార్డులను కూడా పొందింది. తెలుగులో శ్రేయా ఘోషల్‌కు ఎంతో మంది అభిమానులున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement