ఇండియన్ ప్రీమియర్ లీగ్ క్రికెట్ ను కొత్త పుంతలు తొక్కించింది. దేశవాలీలో సత్తా చాటుతున్న ప్లేయర్లు ఈ లీగ్ ద్వారా వెలుగులోకి వచ్చారు. అంతేకాదు ఐపీఎల్ ప్రారంభమైనప్పటినుంచి ఇప్పటిదాకా అన్ని సీజన్లలోనూ భారీ మొత్తంలో వ్యాపారం జరిగింది. ఆటగాళ్లకు భారీ వేతనాలు దక్కాయి. ధనాధన్ ఆటాడే ఆటగాళ్లకు భారీ మొత్తంలో కాసులు కురిపిస్తుంది ఈ లీగ్. మరి ఇలాంటి లీగ్ లో ఆడే అవకాశం వస్తే ఏ ఆటగాళ్లు వదులుకోరు.ఈ అంశాన్నే ఇంగ్లాండ్ స్టార్ ప్లేయర్ జోస్ బట్లర్ కూడా ఇప్పుడు ప్రస్తావించాడు.
ఐపీఎల్ వల్ల కలిగే ప్రయోజనాలన్నీ మనకు తెలుసు. ఇదో భారీ లీగ్. డబ్బులూ భారీగానే ముడుతాయి. ఇక్కడి క్రికెట్ అనుభవం ఎంతగానో పనికొస్తుంది. ఇంగ్లాండ్ క్రికెట్కు ఉపయోగపడుతుంది. ఐపీఎల్లో భాగస్వాములయ్యే మా క్రికెటర్లందరికీ ఈ ప్రయోజనాలు దక్కుతాయి. షెడ్యూలు కఠినంగా ఉందని తెలుసన్నాడు బట్లర్. సమతూకం కోసం ఈసీబీ, క్రికెటర్లు ప్రయత్నిస్తున్నారు. చాలామందికి ఐపీఎల్ డబ్బులతో ఉపయోగం ఉంటుంది. ఆర్థికపరంగా ఐపీఎల్ అతిపెద్ద టోర్నీ. మా కెరీర్లు చిన్నవే కానీ ఇంగ్లాండ్కు ఆడటాన్ని మేం గౌరవంగా భావిస్తాం. ఈసీబీ సైతం మాకు మంచి వేతనాలే ఇస్తోంది’ అని బట్లర్ తెలిపాడు.