బెంగాల్ లో అసెంబ్లీ ఎన్నికల వేడి మొదలైంది నాయకులు తమ తమ వ్యూహాలతో ముందడుగు వేస్తున్నారు. ఫైర్ బ్రాండ్ పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్జీ తనదైన శైలిలో దూసుకుపోతున్నారు. ముఖ్యంగా మమత కంచుకోటలోకి ఎలాగైనా పాగా వేయాలని బీజేపీ ప్లాన్ చేస్తున్న తరుణంలో ఆమే వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో నందిగ్రామ్ నుంచి బరిలోకి దిగుతున్నట్టు తేల్చి చెప్పారు మమత. అంతేకాదు ఏకంగా 291 అభ్యర్థులను మొదటి విడత లోనే ప్రకటించింది. మరో మూడు నియోజకవర్గాలకు అభ్యర్థులను త్వరలోనే ప్రకటించనున్నారు. ప్రకటించిన జాబితాలో మహిళలు 51 మంది, మైనారిటీలు 42, ఎస్సీలు 79, ఎస్టీలు 17 మంది టికెట్లు దక్కించుకున్నారు. అయితే ఈసారి కరోనా నేపథ్యంలో 80 ఏళ్లకు పైబడిన వారికి టికెట్లు ఇవ్వడం లేదని చెప్పారు మమత.
టీఎంసీ అభ్యర్థులను ప్రకటించిన సీఎం మమత
Previous article
మరిన్ని వార్తలు
Advertisement
తాజా వార్తలు
Advertisement