కరోనా వ్యాప్తి తీవ్రత గత వారం రోజులుగా పెరుగుతోందని ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యు హెచ్ ఓ) పేర్కొంది. ఆ సంస్థ చీఫ్ ఈ రోజిక్కడ ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ ప్రపంచ వ్యాప్తంగా కరోనా వ్యాప్తి తీవ్రత గత వారం రోజులుగా పెరుగుతోందన్నారు. అంతకు ముందు ఏడు వారాలుగా వ్యాధి తీవ్రత తగ్గుతూ వచ్చిందనీ, అయితే గత వారం రోజులుగా మహమ్మారి తిరిగి విజృంభిస్తున్నదని పేర్కొన్నారు. ఇందుకు ప్రధాన కారణం పలు దేశాల్లో కరోనా నిబంధనల సడలింపేనని ఆయన అభిప్రాయపడ్డారు. కరోనా మహమ్మారి తిరిగి విజృంభించడం ఆందోళనకరమని పేర్కొన్నారు. అలాగే కరోనా కట్టడి విషయంలో అత్యంత ముఖ్యమైన వ్యాక్సినేషన్ పేద దేశాలకు అందడంలో అలవిగాని ఆలస్యం జరుగుతోందని పేర్కొన్నారు.
Advertisement
తాజా వార్తలు
Advertisement