Friday, November 22, 2024

చెన్నై: పుల్వామా ఉగ్రదాడిని దేశం మరువదు : మోడీ

పుల్వామా ఉగ్రదాడిని దేశం, జనం ఎన్నటికీ మరచిపోరని ప్రధాని నరేంద్ర మోడీ అన్నారు. పుల్వామా ఉగ్రదాడి జరిగి రెండేళ్లయిన సందర్భంగా నాటి దాడిలో 40 మంది సైనికులు మరణించిన సందర్భాన్ని గుర్తు చేసుకుని ఉద్వేగానికి లోనయ్యారు. చెన్నైలో పలు ప్రాజెక్టులు, అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించిన ఆయన మాట్లాడుతూ, ప్రసిద్ధ తమిళ కవి సుబ్రహ్మణ్య భారతి మాటలను గుర్తు చేసుకున్నారు. ఆయుధాలు, కాగితాలు తయారు చేద్దా, పాఠశాలలు, కర్మాగారాలను నిర్మిద్దాం, ఓడలనూ తయారు చేద్దాం అన్న సుబ్రహ్మణ్య భారతి మాటల స్ఫూర్తిగా నేడు రక్షణ రంగంలో ఆత్మనిర్భరత, స్వావలంబన దిశగా వేగంగా అడుగులు వేస్తున్నామని మోడీ అన్నారు. తన తమిళనాడు పర్యటనలో భాగంగా…పూర్తిగా స్వదేశీ నిర్మాణమైన అర్జున్ ట్యాంక్ కు ప్రధాని మోడీ సైన్యానికి అప్పగించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement