ఇంగ్లాండ్ తో నాలుగు టెస్టుల సిరీస్ లో భాగంగా చెన్నై వేదికగా జరిగిన తొలి టెస్టులో భారత్ ఘోర పరాజయం పాలైంది. అన్ని విభాగాలలోనూ సంపూర్ణ ఆధిపత్యం కనబరిచిన ఇంగ్లాండ్ టీమ్ ఇండియాపై 227 పరుగుల భారీ తేడాతో ఘన విజయం సాధించింది.ఈ విజయంతో ఇంగ్లాండ్ సిరీస్ లో 1-0 ఆధిక్యత సాధించింది. తొలి ఇన్నింగ్స్ లో డబుల్ సెంచరీ చేసిన ఇంగ్లాండ్ కెప్టెన్ జోరూట్ కు మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ దక్కింది.
Advertisement
తాజా వార్తలు
Advertisement