ఇంగ్లాండ్ లో నాలుగు టెస్టుల సిరీస్ లో భాగంగా చెన్నై వేదికగా జరుగుతున్న రెండో టెస్టులో భారత్ పట్టు బిగించింది. ఇంగ్లాండ్ ఎదుట కొండంత లక్ష్యాన్ని ఉంచింది. ఈ టెస్టులో ఇంగ్లాండ్ విజయం సాధించాలంటే 482 పరుగులు చేయాల్సి ఉంది. ఈ రోజు 20కు పైగా ఓవర్లూ, మరో రెండు రోజుల ఆట మిగిలి ఉన్న ఈ మ్యాచ్ లో స్పిన్ గింగిరాలు తిరుగుతున్న పిచ్ పై ఈ లక్ష్య ఛేదన ఇంగ్లాండ్ కు కష్ట సాధ్యం. తొలి ఇన్నింగ్స్ 195 పరుగుల భారీ ఆధిక్యతతో రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన టీమ్ ఇండియా, కోహ్లీ, అశ్విన్ ల భారీ భాగస్వామ్యం సాయంతో 286 పరుగులు చేసింది. తొలి ఇన్నింగ్స్ లో 134 పరుగులకే ఆలౌట్ అయిన ఇంగ్లాండ్ కు 482 పరుగుల విజయ లక్ష్యం నిర్దేశించింది. భారత బ్యాట్స్ మెన్ లో ఓపిగ్గా ఆడిన కోహ్లీ 52 పరుగులు చేయగా, అశ్విన్ 106 పరుగులు చేశాడు.
Advertisement
తాజా వార్తలు
Advertisement