భారత్ లో నాలుగు టెస్టుల సిరీస్ లో భాగంగా చెన్నైలో జరుగుతున్న రెండో టెస్ట్ రెండో రోజు ఆటలో ఇంగ్లాండ్ తొలి ఇన్నింగ్స్ లో 134 పరుగులకు ఆలౌట్ అయ్యింది. ఇండియా తొలి ఇన్నింగ్స్ లో 329 పరుగులు చేసిన సంగతి విదితమే. రెండో రోజు పూర్తిగా భారత బౌలర్లు ఆధిపత్యం చెలాయించారు. ఇంగ్లాండ్ స్కిప్పర్ జో రూట్ కేవలం 6 పరుగులే చేశాడు. ఇక భారత బౌలర్లలో అశ్విన్ 5 వికెట్లు పడగొట్టగా, అక్షర్ పటేల్ 2, ఇషాంత్ శర్మ 2, సిరాజ్ 1 వికెట్ పడగొట్టారు. ఇంగ్లాండ్ ఇన్నింగ్స్ లో బెన్ స్టోక్స్ చేసిన 42 పరుగులే హయ్యస్ట్ ఇండివిడ్యువల్ స్కోరు కావడం గమనార్హం.
చెన్నై : ఇంగ్లాండ్ తొలి ఇన్నింగ్స్ : 134 ఆలౌట్- ఇండియాకు 195 పరుగుల తొలి ఇన్నింగ్స్ ఆధిక్యం
Advertisement
తాజా వార్తలు
Advertisement