Saturday, November 23, 2024

చట్టానికి వ్యతిరేకంగా తెలంగాణ సర్కారు పనిచేస్తోంది: విజయసాయిరెడ్డి

తెలంగాణ ప్రభుత్వంపై వైసీపీ రాజ్యసభ ఎంపీ విజయసాయి రెడ్డి తీవ్ర విమర్శలు చేశారు. శుక్రవారం కేంద్రమంత్రి గజేంద్ర సింగ్ షెకావత్‌తో సమావేశమైన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. తెలంగాణ ప్రభుత్వం చట్ట వ్యతిరేకంగా వ్యవహరిస్తోందని, టీఆర్ఎస్ నేతలు చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నారని విజయసాయిరెడ్డి ఆరోపించారు.

చట్ట ప్రకారం తాము కృష్ణా జలాలను వాడుకునేలా చర్యలు తీసుకోవాలని కేంద్రాన్ని కోరామన్నారు. విశాఖ గ్రామీణ ప్రాంతాలకు మంచినీటి సరఫరా కోసం ఏలేశ్వరం ప్రాజెక్టు ఖర్చులో సగభాగం జలజీవన్ పథకం కింద భరించాలని కోరినట్లు చెప్పారు. రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ పథకానికి అనుమతి ఇవ్వాలని.. అలాగే కేఆర్ఎంబీ బోర్డు పరిధిని నోటిఫై చేయాలని విజ్ఞప్తి చేశామన్నారు. కేఆర్ఎంబీ పరిధిలోని ప్రాజెక్టులకు రక్షణ కల్పించాలని కోరినట్లు విజయసాయిరెడ్డి పేర్కొన్నారు.

ఈ వార్త కూడా చదవండి: కృష్ణా జలాలను జగన్‌కు కేసీఆర్ అమ్మేశారు: డీకే అరుణ

Advertisement

తాజా వార్తలు

Advertisement