గుజరాత్ సీఎం విజయ్ రూపానీకి కరోనా పాజిటివ్ నిర్ధారణ అయ్యింది. వడోదరలో ఒక బహిారంగ సభలో మాట్లాడుతూ వేదికపైనే ఆయన కుప్పకూలిన సంగతి విదితమే. అస్వస్థతతో ఉన్నప్పటికీ పలు కార్యక్రమాలలో పాల్గొనడం వల్ల ఆయన సొమ్మసిల్లి పడిపోయారని అంతా భావించారు. అయితే పరీక్షల్లో ఆయనకు కరోనా పాజిటివ్ నిర్ధారణ అయ్యింది. వేదికపై కుప్పకూలిన ఆయనను హెలికాప్టర్ ద్వారా అహ్మదాబాద్ లోని ఓ వైద్య శాలకు తరలించి పరీక్షలు నిర్వహించారు. అక్కడ ఆయనకు కరోనా పాజిటివ్ నిర్థారణ అయ్యింది.
Advertisement
తాజా వార్తలు
Advertisement