కరోనా కట్టడి లో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పూర్తిగా విఫలమయ్యాయని విమర్శించారు టిపిసిసి అధ్యక్షులు ఉత్తమ్ కుమార్ రెడ్డి. సీఎం కేసీఆర్ కరోనా కంట్రోల్ లో తీవ్రంగా ఫెయిల్యూర్ అయ్యారని దుయ్యబట్టారు. మందులు, వైద్య సదుపాయాలు ఏర్పాటు చేయడంలో ఫెయిల్ అయ్యారని విమర్శించారు. ఇక కరోనా ను ఆరోగ్య శ్రీలో చేర్చాలని కోరుతూ గవర్నర్ కి లేఖ రాసినట్లు తెలిపారు ఉత్తమ్. ఈనెల 7న అన్ని జిల్లా కేంద్రాల్లో, గాంధీ భవన్ లో సత్య గ్రహ దీక్షలు చేయబోతున్నట్లు ప్రభుత్వాన్ని హెచ్చరించారు.
ఇక కేంద్ర ప్రభుత్వం వ్యాక్సిన్ ప్రక్రియ ను వేగవంతం చేయాలని..ప్రతి రోజు కోటి మందికి వ్యాక్సిన్ ఇస్తేనే డిసెంబర్ 31వరకు పూర్తవుతుంది. అందరికి ఉచితంగా వ్యాక్సిన్ ఇవ్వాలని డిమాండ్ చేశారు ఉత్తమ్. లేదంటే మూడేండ్లు పడుతుందని..దీనిపై రాష్ట్ర పతికి కూడా మెమోరాండం పంపామని తెలిపారు. కరోనా తో దేశ ఆర్ధిక వ్యవస్థ చిన్నాభిన్నం రాష్ట్రపతికి పంపిన మెమొరాండంలో పేర్కొన్నట్లుగా తెలిపారు.