Tuesday, November 26, 2024

కోవాగ్జినే ది బెస్ట్‌

మిగతా కరోనా వ్యాక్సిన్ల కన్నా కొవాగ్జినే మంచిదని తేల్చి చెప్పింది లాన్సెట్​ అధ్యయనం. భారత్ బయోటెక్ అభివృద్ధి చేసిన కొవాగ్జిన్ పనితీరుపై లాన్సెట్ సంస్థ ప్రశంసలు కురిపించింది. మొదట్లో కొవాగ్జిన్ అనగానే చాలామంది సందేహాలను వ్యక్తం చేశారు. పూర్తికాని వ్యాక్సిన్ ను ప్రజలకు ఎలా ఇస్తారని ప్రశ్నించారు. కానీ మిగతా వ్యాక్సిన్ ల కన్నా కొవాగ్జినే మంచిదని తాజా అధ్యయనం చెబుతోంది. కొన్ని రోజుల క్రితం వ్యాక్సిన్ రెండోదశ ప్రయోగ ఫలితాలను లాన్సెట్ జర్నల్ ప్రచురించింది. కొవాగ్జిన్ చాలా సురక్షితమని తీవ్రమైన దుష్ప్రభావాలు చాలా తక్కువ అని వెల్లడించింది.

అడ్జువెంట్ కలిగిన ఐఎం.డీ.జీతో తయారుచేసిన కో వాక్సిన్ అత్యుత్తమని అని పేర్కొంది. అడ్జువెంట్ ద్వారా వ్యాక్సిన్ పనితీరు మెరుగవుతుంది. ఈ అడ్జువెంట్ తో వచ్చిన తొలి వ్యాక్సిన్ ఇదేనని కాబట్టి దాని పనితీరును మరింత శ్రద్ధగా అంచనా వేసేందుకు యంత్రాంగాన్ని ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉందన్నారు. ఇక వ్యాక్సిన్తో 21 శాతం వరకు మంచి ఫలితాలు వచ్చినట్టు ఐసీఎమ్‌ఆర్‌ ప్రకటించింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement