Saturday, November 23, 2024

కొత్త చీఫ్‌ జస్టిస్‌ బాధ్యతల స్వీకారం

ప్రమాణ స్వీకారం చేయించిన గవర్నర్‌ బిశ్వభూషణ్‌
ముఖ్యమంత్రి జగన్‌ సత్కారంశ్రీ ప్రమాణ స్వీకారం చేయించిన గవర్నర్‌ బిశ్వభూషణ్‌
ముఖ్యమంత్రి జగన్‌ సత్కారం

అమరావతి, ఆంధ్రప్రభ: రాష్ట్ర ఉన్నత న్యాయస్థానం ప్రధాన న్యాయమూ ర్తిగా జస్టిస్‌ ప్రశాంత్‌కుమార్‌ మిశ్రా ప్రమాణ స్వీకారం చేశారు. బుధవారం మధ్యాహ్నం 1.10 గంటలకు గవర్నర్‌ విశ్వభూషణ్‌ హరిచందన్‌ సీజేతో ప్రమాణ స్వీకారం చేయించారు. అనంతరం ప్రమాణ స్వీకారపత్రంపై సీజే సంతకం చేశారు. విజయవాడ తుమ్మలపల్లి కళాక్షేత్రంలో జరిగిన ఈ ప్రమాణ స్వీకారోత్సవ కార్య క్రమానికి గవర్నర్‌తో పాటు ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డి, మంత్రులు బొత్స సత్యనారాయణ, వెల్లంపల్లి శ్రీనివాసరావు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డాక్టర్‌ సమీర్‌ శర్మతో పాటు హైకోర్టు న్యాయమూర్తులు, అడ్వొకేట్‌ జనరల్‌ ఎస్‌ శ్రీరాం తది తరులు హాజరయ్యారు. అనంతరం గవర్నర్‌ నేతృత్వంలో హైటీ ఏర్పాటు చేశారు. సీజే జస్టిస్‌ మిశ్రాకు గవర్నర్‌ విశ్వభూషణ్‌, ముఖ్యమంత్రి జగన్‌ పుష్పగుచ్ఛాలు అం దజేసి శాలువలతో సత్కరించారు. తొలుత ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డాక్టర్‌ సమీర్‌ శర్మ కార్యక్రమాన్ని ప్రారంభించారు. హైకోర్టు రిజిస్ట్రార్‌ రాష్ట్రపతి ఉత్తర్వులను చది వి వినిపించారు. అనంతరం జస్టిస్‌ మిశ్రా ప్రమాణ స్వీకారం చేశారు. గవర్నర్‌ ము ఖ్య కార్యదర్శి ఆర్‌పీ సిసోడియా, న్యాయవాద సంఘాల ప్రతినిధులు హాజర య్యారు. ప్రోటోకాల్‌ ప్రకారం మధ్యాహ్నం విందు ఏర్పాటు చేశారు. రాష్ట్రంలోని పరిస్థితులు, చత్తీస్‌గఢ్‌లో తన అనుభవాలపై గవర్నర్‌ విశ్వభూషణ్‌, సీఎం జగన్‌తో కలిసి సీజే జస్టిస్‌ మిశ్రా ఇష్టోగోష్టిగా మాట్లాడారు. ప్రమాణ స్వీకారం సందర్భంగా తుమ్మలపల్లి కళాక్షేత్రం మీదుగా వచ్చే వాహనాల రాకపోకలను మళ్లించారు. విస్తృత పోలీస్‌ బందోబస్తు, జాతీయ గీతాలాపనల మధ్య కార్యక్రమం అట్టహాసంగా సాగింది.
దుర్గమ్మను దర్శించుకున్న సీజే దంపతులు
ఇంద్రకీలాద్రిపై దుర్గమ్మవారిని రాష్ట్ర హైకోర్టు ప్రధాన న్యాయముూర్తి జస్టిస్‌ ప్రశాంత్‌కుమార్‌ మిశ్రా దంపతులు దర్శించుకున్నారు. ప్రమాణ స్వీకారోత్సవం అనంతరం బుధవారం సాయంత్రం దుర్గగుడికి చేరుకున్న సీజే దంపతులకు ఆల య అధికారులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. వేదపండితులు ఆశీర్వచనం చేశారు. అనంతరం దేవాదాయశాఖ ముఖ్య కార్యదర్శి వాణీమోహన్‌,ఆలయ ఈఓ భ్రమరాంబ తదితరులు అమ్మవారి చిత్రపటాన్ని బహుకరించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement