Friday, November 22, 2024

కేటీఆర్ పేరుతో బురిడీ కొట్టిస్తున్న మాజీ క్రికెటర్

తెలంగాణ మంత్రి కేటీఆర్ వ్యక్తిగత కార్యదర్శినంటూ మోసాలకు పాల్పడుతున్న ఓ వ్యక్తిని హైదరాబాద్ టాస్క్‌ఫోర్స్ పోలీసులు అరెస్ట్ చేశారు. కేటీఆర్ పేరు చెప్పి పలువురు వ్యాపారవేత్తలు, కార్పొరేట్ ఆస్పత్రులకు నిందితుడు ఫోన్ చేసి యజమానుల నుంచి డబ్బుల వసూళ్లకు పాల్పడేవాడని పోలీసులు తెలిపారు. ఈ మేరకు నిందితుడి నుంచి రూ.10 లక్షలు స్వాధీనం చేసుకున్నామని పేర్కొన్నారు. కాగా నిందితుడి ఏపీ మాజీ రంజీ క్రికెటర్ నాగరాజు అని తెలుస్తోంది. గ‌తంలోనే నాగ‌రాజుపై బంజారాహిల్స్, ఓయు, సనత్‌నగర్‌, మాదాపూర్, బాచుపల్లి, కూకట్‌పల్లి పోలీస్‌స్టేషన్‌లతో పాటు విశాఖపట్నం, నెల్లూరు, మాచవరం, గుంటూరులలోనూ కేసులు నమోదు అయ్యాయి. నాగరాజుపై పీడీ యాక్ట్ కేసు కూడా నమోదు అయ్యింది. ఇంటర్ స్టేట్ క్రిమినల్‌ అయిన నాగరాజు క్రికెట్ కిట్‌లను ఫ్రీగా ఇస్తామంటూ డబ్బులు వసూలు చేశాడు. కాగా, 2014-16 వ‌ర‌కు ఆంధ్ర‌ప్ర‌దేశ్ నుంచి రంజీ మ్యాచ్‌ల్లో నాగ‌రాజు ఆడాడు. నాగ‌రాజు స్వ‌స్థ‌లం శ్రీకాకుళం జిల్లా య‌వ్వారిపేట గ్రామం.

Advertisement

తాజా వార్తలు

Advertisement