Monday, November 25, 2024

కృష్ణజింక వేట కేసులో ‘సల్మాన్ ఖాన్’ కి ఊరట

కృష్ణజింక వేట కేసులో బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ కి ఊరట లభించింది. ఆ వివరాలు. సల్మాన్ పై రాజస్థాన్ ప్రభుత్వం దాఖలు చేసిన రెండు పిటిషన్లను కోర్టు కొట్టివేసింది. దీంతో తాజాగా సోషల్ మీడియా పోస్ట్ లో సల్మాన్ ఖాన్ ఉద్వేగంగా కనిపించారు. బ్లాక్ బ్లేజర్ లో ఉత్సాహంగా కనిపిస్తున్న భాయ్  తన అభిమానులను ప్రేమగా చురచురా చూస్తే.. వారి ప్రేమ మద్దతుకు ధన్యవాదాలు తెలిపారు. నా అభిమానులందరికీ .. మీ ప్రేమ మద్దతు ఆందోళనకు ధన్యవాదాలు అనీ ఆయన అన్నారు. 2003 లో కోర్టులో తప్పుడు అఫిడవిట్ సమర్పించిన కేసులో  సల్మాన్ పై రాజస్థాన్ ప్రభుత్వం దాఖలు చేసిన రెండు పిటిషన్లను కొట్టివేసిన జోధ్ పూర్ జిల్లా సెషన్స్ కోర్టు నుండి ఊపిరి పీల్చుకున్న ఉద్వేగం సల్మాన్ ఖాన్ లో కనిపించింది. ఆయన తీర్పు వెలువరించిన న్యాయమూర్తికి కృతజ్ఞతలు తెలిపారు. ఈ కేసులో భాయ్ పై వచ్చిన పిటిషన్లు కొట్టివేశామని జడ్జి రాఘవేంద్ర కచ్వాల్ సారథ్యంలోని బెంచ్ చెప్పిన వెంటనే ఎమోషనల్ ఖాన్ ధన్యవాదాలు సర్ అని అన్నారు. ఒకవేళ సల్మాన్ దోషిగా నిరూపితమైతే అతనిపై భారత శిక్షాస్మృతిలోని సెక్షన్ 193 కింద కేసు నమోదయ్యేది. దీనికి ఏడు సంవత్సరాల జైలు శిక్ష విధించాల్సి ఉంటుందని అతని న్యాయవాది హస్తిమల్ సరస్వత్ ఓ మీడియాకి చెప్పారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement