పెద్దపల్లి జిల్లాలో జరిగిన లాయర్ వామన్‌రావు దంపతుల హత్య కేసులో నిందితులను పోలీసులు గురువారం మధ్యాహ్నం మంథని కోర్టులో హాజరుపరిచారు. ఈ కేసులో మొత్తం 13 మంది వాంగ్మూలాలను మంథని కోర్టు రికార్డు చేసింది. ఇక ఈ కేసులో ఓ స్టిక్కర్ పోలీసులు కీలక ఆధారంగా మారింది. నిందితులు కుంట శ్రీను, చిరంజీవి ముందుగా తమ కారును వామన్‌రావు కారుకు ఎదురు తీసుకెళ్లి అడ్డుపెట్టడమే కాకుండా ఢీకొట్టారు. ఈ ఘటనలో నిందితుల కారుకు ఉన్న పసుపు రంగు రేడియం స్టిక్కర్‌లోని కొంత భాగం వామన్‌రావు కారు ముందు భాగానికి అతుక్కుపోయింది. ఈ ఆధారాన్ని క్లూస్ టీమ్ సేకరించి విచారణ చేపట్టింది. అటు కారు డ్రైవర్ డోర్ హ్యాండిల్, గేర్ రాడ్డుపై రక్తపు మరకలనూ క్లూస్ టీమ్ గుర్తించింది. ఈ మరకలు వామన్‌రావు దంపతులవే అని తేలితే నిందితుల పాత్ర నిగ్గు తేల్చడంలో కీలక ఆధారాలు కానున్నాయి.
Advertisement
తాజా వార్తలు
Advertisement