Friday, November 22, 2024

కరోనాతో స్టార్ పంజాబీ సింగర్ కన్నుమూత..

కరోనాతో పంజాబ్ స్టార్ సింగర్ శార్దూల్ సికిందర్ కన్నుమూశారు. కిడ్నీ సమస్యతో బాధపడుతున్న శార్దూల్ నెల రోజుల క్రితం ఆసుపత్రిలో అడ్డిట్ అయ్యారు. కిడ్నీ శస్త్ర చికిత్స విజయవంతమైనప్పటికీ ఆయనకి కరోనా సోకడంతో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారాయన. శార్దూల్ సికిందర్ పంజాబీ లాంగ్వేజ్ ఫోక్ సింగర్..పాప్ సింగర్. మొహాలీలోని ఫోర్టిస్ ఆస్ప‌త్రిలో చేరారు. కిడ్నీ స‌మ‌స్య‌తో బాధ‌ప‌డుతున్న శార్దూల్‌.. నెల రోజుల క్రితం ఆస్ప‌త్రిలో అడ్మిట్ అయ్యారు.  1980లో ఆయ‌న రోడ్‌వేస్ ది లారీ పేరిట‌ మొద‌టి ఆల్బ‌మ్‌ను విడుద‌ల చేశారు. ఆ త‌ర్వాత శార్దూల్‌కు మంచి పాపులారిటీ వ‌చ్చింది. మంచి హిట్ సాంగ్స్ ఇచ్చారు. ఆయ‌న న‌ట‌న‌కు మంచి గుర్తింపు కూడా వ‌చ్చింది.  జ‌గ్గా ద‌కురా మూవీలో శార్దూల్ న‌ట‌న ఎంద‌రినో మెప్పించింది. సింగ‌ర్ శార్దూల్ సికింద‌ర్ మృతిప‌ట్ల పంజాబ్ సీఎం అమ‌రీంద‌ర్ సింగ్‌, శిరోమ‌ణి అకాలీద‌ళ్ ప్రెసిడెంట్ సుఖ్‌బీర్ సింగ్ బాద‌ల్ సంతాపం తెలిపారు. ఆయ‌న కుటుంబ స‌భ్యుల‌కు ప్ర‌గాఢ సానుభూతి ప్ర‌క‌టించారు. పంజాబ్ వాసులు గొప్ప సింగ‌ర్‌, న‌టుడిని కోల్పోయార‌ని పేర్కొన్నారు. ఆయ‌న మ‌ర‌ణం పంజాబీ ఫిలిం ఇండ‌స్ర్టీకి తీర‌ని లోటు అని చెప్పారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement