Saturday, November 23, 2024

కరోనాకు ముందు మ్యూజిక్ ఆర్టిస్ట్.. ఇప్పుడు చెప్పుల వ్యాపారి

కరోనా వైరస్ మహమ్మారి దాపురించి 20 నెలలైంది. ఇప్పటివరకు ప్రపంచంలో దాదాపు 20 కోట్ల మంది ఆ వైరస్ బారినపడ్డారు. చాలా మంది ఉద్యోగాలు పోయాయి. ఉపాధి అవకాశాలు గల్లంతయ్యాయి. వ్యాక్సిన్లు కూడా వైరస్‌ను ఆపలేకపోతున్నాయి. కరోనా వచ్చాక చాలా మంది ఉపాధి పోవడంతో కొత్త కొత్త వ్యాపారాలు ప్రారంభించారు. గుజరాత్‌లోని అహ్మదాబాద్‌లో బాగా బతికిన ఓ మ్యూజిక్ ఆర్టిస్ట్… ఇప్పుడు దీన స్థితికి చేరాడు. మ్యూజిక్ బ్యాండ్ ఆఫర్లు లేక సొంత వ్యాపారం పెట్టుకున్నాడు.

మ్యూజిక్ ఆర్టిస్ట్ హేమంత్ భాయ్ సోలంకి కాంగో, తబలా, ధోలక్… ఇలా చాలా సంగీత వాయిద్యాల్ని వాయించగలడు. 2007 నుంచి కెరీర్ ఆరంభించిన అతడు.. ఈ 15 ఏళ్లలో ఎన్నో కార్యక్రమాలు చేశాడు. గుజరాత్‌, ఇండియాలోని కొన్ని రాష్ట్రాలతో పాటు విదేశాల్లో కూడా షోలు చేశాడు. కరోనా వచ్చాక షోలన్నీ ఆగిపోవడంతో అతడికి పని లేకుండా పోయింది. దాంతో ఉన్న డబ్బుతో చెప్పుల షాపు పెట్టాడు. తద్వారా వచ్చే ఆదాయంతో తన ఫ్యామిలీని నెట్టుకొస్తున్నాడు. ఈ కరోనా ఎప్పుడు పోతుందా… ఎప్పుడు మళ్లీ తనకు ఆఫర్లు వస్తాయా అని ఎదురుచూస్తున్నాడు.

ఈ వార్త కూడా చదవండి: బిర్యానీలో బీర్ సీసా ముక్కలు.. హోటల్‌కు రూ.12వేలు జరిమానా

Advertisement

తాజా వార్తలు

Advertisement