బాలీవుడ్ హీరోయిన్ కరీనా కపూర్‌కు కొడుకు పుట్టి రోజులు గడుస్తున్నా ఇప్పటివరకు అతడి ముఖాన్ని అభిమానులకు చూపించనేలేదు. దీంతో కరీనా ఎప్పుడెప్పుడు ఆ బుడతడిని పరిచయం చేస్తుందా? అని ఫ్యాన్స్ తహతహలాడుతున్నారు. ఈ క్రమంలో కరీనా అందరినీ సర్ప్రైజ్ చేస్తూ తన రెండో పిల్లాడిని ఎత్తుకున్న ఫొటోను ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసింది. ‘మహిళకు సాధ్యం కానిదంటూ ఏదీ లేదు. మహిళా దినోత్సవ శుభాకాంక్షలు..’ అంటూ క్యాప్షన్ ఇచ్చింది.
అయితే ఈ ఫొటోలో కరీనా కొడుకు ముఖం కనిపించకపోవడంతో ఆమె ఫ్యాన్స్ కొంత నిరుత్సాహపడుతున్నారు. నీ రెండో కొడుకును ఇంకెప్పుడు చూపిస్తావంటూ కామెంట్లు చేస్తున్నారు. ప్రస్తుతం ఈ ఫోటో వైరల్ గా మారింది.కాగా 2012లో కరీనా కపూర్-సైఫ్ అలీఖాన్ పెళ్లి చేసుకుని ఒక్కటయ్యారు. ఈ దంపతులకు 2016 డిసెంబర్లో తైమూర్ జన్మించాడు. సుమారు ఐదేళ్ల గ్యాప్ తర్వాత ఫిబ్రవరి 21న కరీనా మరోసారి మగ బిడ్డకు జన్మనిచ్చింది. దీంతో పలువురు సెలబ్రిటీలు ఆమెకు శుభాకాంక్షలు తెలిపారు.