Friday, November 22, 2024

ఒక్క డీఎస్సీ కూడా ఎందుకు వేయలేదు?: ఉత్తమ్

హైదరాబాద్: టీఆర్ఎస్ ప్రభుత్వంపై టీపీసీసీ చీఫ్ ఉత్తమ్ విమర్శలు చేశారు. టీఆర్ఎస్ పార్టీకే ఓటు వేయాలని పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ఓటర్లతో ఆ పార్టీ నేతలు ప్రమాణం చేయిస్తున్నారని టీపీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆరోపించారు. టీఆర్ఎస్ నేతలు ప్రమాణాలు చేయిస్తున్న వీడియోలపై ఈసీకి ఫిర్యాదు చేశామన్న ఆయన.. ఉపాధ్యాయ సంఘాలను మంత్రులు బెదిరిస్తున్నారని మండిపడ్డారు. ఏడేళ్ల పాలనలో ఒక్క డీఎస్సీ కూడా ఎందుకు వేయలేదో సీఎం కేసీఆర్ నిరుద్యోగులకు సమాధానం చెప్పాలని ఉత్తమ్ డిమాండ్ చేశారు.

అటు అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా మహిళలకు శుభాకాంక్షలు తెలిసిన ఉత్తమ్.. కాంగ్రెస్ పార్టీ మహిళలకు అధిక ప్రాధాన్యమిస్తోందని వ్యాఖ్యానించారు. మహిళలను రాజకీయంగా ప్రోత్సహించింది కాంగ్రెస్ పార్టీనే అన్న ఆయన.. స్థానిక సంస్థల ఎన్నికల్లో మహిళలకు రిజర్వేషన్లు కల్పించిన ఘనత కూడా తమ పార్టీదే అన్నారు. అన్ని రంగాల్లో మహిళలు సమాన అవకాశాలు పొందాలని ఆయన ఆకాంక్షించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement