దేశంలో కరోనా పరిస్థితుల కారణంగా ఐటీ రిటర్న్స్ దాఖలు గడువును పెంచుతూ కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. 2020-21 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి వ్యక్తుల రిటర్నుల దాఖలు గడువును సెప్టెంబర్ 30 వరకు పొడిగిస్తూ సెంట్రల్ బోర్డ్ ఆఫ్ డైరెక్ట్ ట్యాక్సెస్ (CBDT) నిర్ణయం తీసుకుంది. అటు వ్యక్తుల రిటర్న్స్ మాత్రమే కాకుండా కంపెనీల రిటర్న్స్కు కూడా నవంబర్ 30 వరకు అవకాశం ఇచ్చింది. కాగా అంతకు ముందు వ్యక్తులు రిటర్న్స్ దాఖలు చేయడానికి జులై 31, కంపెనీలకు అక్టోబర్ 31 వరకు CBDT గడువు ఉండేది.
అటు కంపెనీలు తమ ఉద్యోగులకు జారీ చేసే ఫారం-16 గడువును కూడా జూలై 15వ తేదీ వరకు పెంచుతూ CBTD నిర్ణయం తీసుకుంది. ట్యాక్స్ రిటర్న్స్ దాఖలును సులభతరం చేయడానికి ఐటీ శాఖ ఈ-ఫైలింగ్ పోర్టల్ ను అందుబాటులోకి తెచ్చింది. పాత పోర్టల్ www.incometaxindiaefiling.gov.in స్థానంలో కొత్తపోర్టల్ www.incometaxgov.inను తీసుకురానుంది. జూన్ 7వ తేదీ నుండి ఈ కొత్త పోర్టల్ అందుబాటులో ఉంటుంది.