Sunday, November 24, 2024

ఏలూరులో మున్సిపల్ ఎన్నికలకు బ్రేక్

మున్సిపల్ ఎన్నికలకు సంబంధించి హైకోర్టు కీలక తీర్పు వెలువరించింది. ఏలూరు కార్పొరేషన్ ఎన్నికలు నిలిపివేయాలని ఆదేశించింది. ఓటర్ల జాబితాకు సంబంధించి దాఖలైన పిటిషన్‌పై విచారణ చేపట్టిన న్యాయస్థానం.. ఏలూరు ఎన్నికలు నిలిపివేయాలని ఆదేశించింది. ఇక్కడ వార్డుల విభజనలో అవకతవకలు జరిగాయని ఫిర్యాదులు నమోదు కావడంతో కోర్టు ఈ నిర్ణయం తీసుకుంది. కాగా ఏపీ మున్సిపల్ ఎన్నికల ప్రచారం సోమవారం సాయంత్రంతో ముగిసింది. ఈ ఎన్నికల బరిలో మొత్తం 7,552 మంది అభ్యర్థులు ఉండగా.. ఇప్పటికే చిత్తూరు, కడప, తిరుపతి కార్పొరేషన్‌లతో పాటు 12 మున్సిపాలిటీలు వైసీపీ ఖాతాలోకి వెళ్లిపోయాయి. ఈనెల 10న మున్సిపాలిటీలు, నగర పంచాయతీలకు ఎన్నికలు జరగనుండగా.. 14న ఎన్నికల ఫలితాలు వెలువడనున్నాయి.

Advertisement

తాజా వార్తలు

Advertisement