తెలంగాణలో వైఎస్ షర్మిల పార్టీ ప్రకటనకు ముహూర్తం ఖరారైంది. ఏప్రిల్ 9న రాజకీయ పార్టీ పేరుతో పాటు పార్టీ విధివిధానాలను షర్మిల ప్రకటించనున్నట్లు ఆమె ముఖ్య సలహాదారుడు దేవేందర్‌రెడ్డి ‘ఇండియా ఎ హెడ్’కు వివరించారు. అన్ని జిల్లాల ఆత్మీయ సమ్మేళనం తర్వాతే పార్టీ ప్రకటన ఉంటుందన్నారు. ఏప్రిల్ 9న ఖమ్మంలో పార్టీ ప్రకటన ఉంటుందని, పేర్కొన్నారు. అనంతరం హైదరాబాద్‌లో భారీ బహిరంగ సభ నిర్వహిస్తారని తెలిపారు. ఎందరో మహానుభావుల బలిదానాలతో వచ్చిన తెలంగాణ సామాన్య ప్రజల తెలంగాణగా మారాలని, తెలంగాణ యువత, తెలంగాణ మహిళా సమాజానికి అక్కగా అండగా నిలిచేందుకు షర్మిల రాజకీయ పార్టీ పెడుతున్నారని దేవేందర్‌రెడ్డి చెప్పారు. షర్మిల తెలంగాణలో పుట్టారని, ఆమె పిల్లలు కూడా తెలంగాణలోనే పుట్టారని, ఇక్కడే పెరిగారని.. ఆమె ఏపీకి వెళ్లే అవకాశమే లేదని ఆయన అన్నారు. ఇంకా ఏపీ, తెలంగాణ అని మాట్లాడేవారికి బుర్ర లేదని దేవేందర్‌రెడ్డి మండిపడ్డారు. తెలంగాణ సమాజం షర్మిల రాకను స్వాగతిస్తోందని ఆయన పేర్కొన్నారు. యువతకు, మరీ ముఖ్యంగా మహిళలకు తెలంగాణ రాజకీయాల్లో చాలా స్పేస్ ఉందని దేవేందర్‌రెడ్డి అభిప్రాయపడ్డారు.
Advertisement
తాజా వార్తలు
Advertisement