Friday, November 22, 2024

ఏపీ మహిళలకు జగన్ సర్కారు గుడ్ న్యూస్.. ఫోన్ కొంటే 10 శాతం డిస్కౌంట్

మహిళా దినోత్సవం సందర్భంగా ఏపీ సీఎం క్యాంపు ఆఫీసులో మహిళా దినోత్సవ వేడుకలు జరిపారు. ఆర్థిక, సామాజిక, రంగాల్లో మహిళలకు అవకాశం కల్పించాలన్నారు సీఎం జగన్‌. మహిళల సెవలకు ఆర్థిక కొలమానాలు లేవన్న సీఎం మహిళలకు సగభాగం ఇస్తున్నామా లేదా అని ఆలోచించుకోవాలన్నారు. ఏపీలో మహిళ ఉద్యోగుల క్యాజువల్‌ లీవ్స్‌ 20 రోజులకు పెంచామని సీఎం తెలిపారు.

ఇక మహిళా దినోత్సవం సందర్భంగా ఇవాళ ఫోన్ కొనుగోలు చేసే స్త్రీలకు 10 శాతం డిస్కౌంట్ ఇవ్వనున్నట్లు ప్రకటించింది ప్రభుత్వం. ఎంపిక చేసిన మొబైల్‌ షాపుల్లో ఈ ఆఫర్ వర్తిస్తుంది. అయితే ఇవాళ ఒక్కరోజే ఈ డిస్కౌంట్ వర్తిస్తుంది. దిశ యాప్‌ను డౌన్‌లోడ్‌ చేసుకునే వారికి మాత్రమే పది శాతం రాయితీ వర్తిస్తుంది. దిశ యాప్ డౌన్‌లోడ్ చేసుకోవడానికి వీలుగా క్యూఆర్ కోడ్‌తో 2 వేల స్టాండ్‌లు ఏర్పాటు చేసినట్లు సీఎం తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement