Friday, November 22, 2024

ఎమ్మెల్సీ ఎన్నికలకు నామినేషన్ దాఖలు చేసిన పీవీ కుమార్తె వాణిదేవి

పట్టభద్ర ఎమ్మెల్సీ ఎన్నికలకు టీఆర్ఎస్ అభ్యర్థిగా పీవీ నరసింహారావు కుమార్తె వాణిదేవి నామినేషన్ దాఖలు చేశారు. అంతకు ముందు ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు ఆమెకు బీఫామ్ అందజేశారు.  పార్టీ నేతల సమక్షంలో వాణిదేవి జీహెచ్ఎంసీ కార్యాలయంలో నామినేషన్ దాఖలు చేశారు. మహబూబ్ నగర్, రంగారెడ్డి, హైదరాబాద్ పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానానికి జరగనున్న ఎన్నికలపై ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు ఆ యా జిల్లాలకు చెందిన మంత్రులు, ఎమ్మెల్యేలతో సమావేశం నిర్వహించారు. ఆ సమావేశానికి వాణిదేవి హాజరయ్యారు. ఆ సమావేశంలో వాణిదేవిని పార్టీ నేతలు మంత్రులకు పరిచయం చేసి పీవీ కుమార్తె  విజయానికి కృషి చేయాలని దిశానిర్దేశం చేశారు.  ఈ సమావేశం అనంతరం  వాణిదేవి.. గన్‌పార్క్‌కు వెళ్లారు. అక్కడ అమరవీరుల స్థూపానికి వాణిదేవి నివాళులర్పించారు. గన్‌ పార్క్‌ వద్ద నివాళులర్పించిన వారిలో మంత్రులు తలసాని శ్రీనివాస యాదవ్‌, నిరంజన్‌ రెడ్డి, సబితా ఇంద్రా రెడ్డి, ఎంపీ డాక్టర్‌ గడ్డం రంజిత్‌ రెడ్డి, మాజీ మంత్రి లక్ష్మారెడ్డి, ఎమ్మెల్సీలు నారాయణరెడ్డి, శ్రీనివాస్‌ రెడ్డి, పట్నం మహేందర్‌ రెడ్డి, ఎమ్మెల్యేలు ప్రకాశ్‌ గౌడ్‌, మహేశ్‌ రెడ్డితో పాటు టీఆర్‌ఎస్‌ నాయకులు ఉన్నారు . సీఎంతో సమావేశం కంటే ముందు. నెక్లెస్‌ రోడ్డులోని పీవీ ఘాట్‌ వద్ద వాణిదేవి పుష్పగుచ్ఛం ఉంచి నివాళులర్పించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement