ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో పర్యవేక్షణ, ఫిర్యాదుల కోసం రాష్ట్ర ఎన్నికల సంఘం తీసుకొచ్చిన ‘ఈ వాచ్’ యాప్‌పై హైకోర్టు కీలక నిర్ణయం తీసుకుంది. ‘ఈ వాచ్’ యాప్‌కు అనుమతులు లేవంటూ యాప్‌ను నిలిపివేస్తూ ఆదేశాలు జారీ చేసింది. కోర్టు లేవనెత్తిన టెక్నికల్ ప్రశ్నలకు ఎస్ఈసీ సమాధానం ఇవ్వకపోవడంతో ఈ నిర్ణయం తీసుకుంది. కేసు విచారణను ఇంతటితో ముగిస్తున్నట్టు స్పష్టం చేసింది. అయితే రాబోయే ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల్లో ‘ఈ వాచ్’ యాప్‌పై అభ్యంతరాలు ఉంటే కోర్టుకు రావొచ్చని సూచించింది.
Advertisement
తాజా వార్తలు
Advertisement