Friday, November 22, 2024

ఈ ఏడాది తొలి సంపూర్ణ సూర్యగ్రహణం..ఇదే రింగ్‌ ఆఫ్‌ ఫైర్‌

ఈ ఏడాదిలో మొదటి సూర్య గ్రహణం.. అది సంపూర్ణ సూర్యగ్రహణం ఈరోజు ఏర్పడనుంది. సూర్యుడు, భూమికి మధ్య చంద్రుడు రావడం వల్ల సూర్య కిరణాలు చంద్రుడిపై పడి చంద్రుడి నీడ భూమిపై పడటంతో ఈ గ్రహణం ఏర్పడుతుంది. ఈ సంపూర్ణ సూర్యగ్రహణం ప్రభావం భారతదేశంలో ఉండదని పండితులు తెలిపారు. చంద్రుడు సూర్యుడికి పూర్తిగా అడ్డుగా రావడం వల్ల అది ఓ రింగ్‌లా ఏర్పడటంతో రింగ్‌ ఆఫ్‌ ఫైర్‌ అని పిలుస్తారు. ఇటీవల ఒక చంద్రగ్రహణం ఏర్పడగా.. జూన్‌ 10న అంటే ఇవాళ సూర్య గ్రహణం ఏర్పడుతుంది. భారతదేశంలో గ్రహణం లడఖ్, అరుణాచల్ ప్రదేశ్‌లో మాత్రమే కనిపిస్తుంది. మధ్యాహ్నం 12 గంటలకు ప్రారంభమవుతుంది. పాక్షిక గ్రహణం మాత్రమే చూడవచ్చు. మధ్యాహ్నం 12.51 గంటలకు ముగుస్తుంది. నాసా ప్రకారం..
జూన్ 10 న గ్రీన్‌లాండ్‌, కెనడా, ఉత్తర అమెరికా, ఆర్కిటిక్‌, అంటార్కిటిక్‌, యూరప్‌, రష్యా, ఆస్ట్రేలియా వంటి ప్రాంతాల్లో ఈ సూర్యగ్రహణం కనబడుతుంది.

సూర్యగ్రహణం కనిపించే దేశాల్లో నివసించే భారతీయులు మాత్రం గ్రహణ సమయంలో వారి పరిస్థితులను బట్టి జప, తప, తర్పణ, స్నాన మరియు హోమ విధులు నిర్వర్తించుకోవచ్చు. ఈ గ్రహణం రోహిణి నక్షత్రంలో ఏర్పడటం వల్ల వృషభ రాశి వారు జాగ్రత్తగా ఉండాలి. గ్రహణం సంభవించే దేశాల్లో వృషభ రాశివారు గ్రహణ సమయంలో సూర్యారాధన, రాహు, దుర్గాదేవి జపం ఆచరించాలని పండితులు సూచిస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement